Sink Cleaning Tips: కిచెన్ సింక్ జామ్ అయ్యి నీళ్లతో నిండిపోయిందా? వెంటనే ఇలా చేయండి క్లియర్ అవుతుంది

Published : Oct 05, 2025, 11:02 AM IST

Sink Cleaning Tips: కిచెన్ సింక్ మూసుకుపోతే వంటింట్లో ఎన్నో పనులు ఆగిపోతాయి. ఇదొక సర్వ సాధారణమైన సమస్యే అయినప్పటికీ.. దీనివల్ల ఆడవాళ్లు ఇబ్బందులు పడతారు. అందుకే ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే దాన్ని ఎలా క్లియర్ చేయాలో తెలుసుకుందాం.. 

PREV
15
కిచెన్ సింక్ బ్లాక్ అయితే ఏం చేయాలి?

కిచెన్ సింక్ మూసుకుపోవడం ప్రతి ఇంట్లో ఒక కామన్ సమస్య. దీనివల్ల సింక్ లో నీళ్లు నిలుస్తాయి. చెత్త పేరుకుపోతుంది. దీనివల్ల వంటపనులు ఆగిపోతాయి. ఇలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించి కిచెన్ సింక్ ను క్లియర్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గోరెవెచ్చని నీళ్లను ఉపయోగించండి

కిచెన్ సింక్ మూసుకుపోయినప్పుడు కంగారు పడకుండా నీళ్లను గోరువెచ్చగా చేయండి. ఈ నీళ్లను ఉపయోగించి సింక్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఈ గోరువెచ్చని నీళ్లను తీసుకుని సింక్ లో నెమ్మదిగా పోయండి. ఇది అడ్డుకున్న వ్యర్థ పదార్థాలను సులువుగా తొలగిస్తుంది. దీంతో సింక్ క్లియర్ అవుతుంది. 

25
బేకింగ్ సోడా, వెనిగర్ ను ఇలా వాడండి

మూసుకుపోయిన కిచెన్ సింక్ ను క్లియర్ చేయడానికి మీరు వెనిగర్, బేకింగ్ సోడాను కూడా ఉపయోగించొచ్చు.   ఇందుకోసం సింక్ లో ముందుగా బేకింగ్ సోడా వేయండి. తర్వాత కొంచెం వెనిగర్ ను పోయండి.  15 నిమిషాలు అలాగే ఉంచి సింక్ లో వేడి నీళ్లు పోయండి. ఇది సింక్ లోని వ్యర్థాలను సులువుగా తొలగిస్తుంది. 

35
ప్లంగర్ ను వాడండి

ప్లంగర్ ను టాయిలెట్లకు మాత్రమే వాడుతారని చాలా మంది అనుకుంటారు. కానీ దీన్ని మీరు సింక్ ను క్లీన్ చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. దీన్ని వాడితే మూసుకుపోయిన సింక్ క్లియర్ అవుతుంది. సింక్ లో ఉన్న వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. అయితే సింక్ లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉండాలంటే ముందుగా సింక్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. అలాగే చెత్తను సింక్ లో వేయకూడదు. 

45
వేడినీళ్లను ఉపయోగించండి

వేడి నీటిని ఉపయోగించి కూడా మీరు మూసుకుపోయిన సింక్ ను క్లియర్ చేయొచ్చు. ఇందుకోసం మీరు వారానికి ఒకసారి సింక్ లో వేడినీళ్లు పోయండి. దీనివల్ల సింక్ లో ఏవైనా చిన్న చిన్న ఆహార వ్యర్థాలు ఉంటే కరిగిపోతాయి. దీనివల్ల సింక్ బ్లాక్ అయ్యే అవకాశం తగ్గుతుంది. 

డ్రెయిన్ స్నేక్ లేదా వైర్ హ్యాంగర్

వ్యర్థాలతో సింక్ బ్లాక్ అయితే దీన్ని క్లియర్ చేయడానికి మీరు డ్రెయిన్ స్నేక్ లేదా వైర్ హ్యాంగర్ ను ఉపయోగించండి. ఇందుకోసం దీన్ని సింక్ లోకి లోపలికి పెట్టి చెత్తను బయటకు తీసేయండి. ఇది పైపులో ఇరుక్కున్న ఆహార వ్యర్థాలను, చెత్త వంటి అడ్డంకులను తొలగించేందుకు సహాయపడుతుంది. 

55
సింక్ బ్లాక్ కాకుండా ఇలాంటి చిట్కాలు పాటించండి

సింక్ లోకి ఆహార పదార్థాలు వెళ్లకుండా ఉండేందుకు ఫిల్టర్ లేదా స్ట్రెయినర్ ను వాడండి. నూనె వంటి పదార్థాలు నేరుగా సింక్ లోకి పోకుండా ఉంటాయి. ఎందుకంటే ఇవి చల్లగా అయిన తర్వాత పైపుకు గట్టిగా అంటుకుపోయి అడ్డుగా నిలుస్తాయి. కాఫీ పొడి, ఆకులు, పిండి పదార్థాలను సింక్ లో వేయకుండా ఉండండి. 

Read more Photos on
click me!

Recommended Stories