మెంతుల హెయిర్ ప్యాక్....
మెంతులు జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీకు కావాల్సిందల్లా మెంతులు, నీరు ఉంటే సరిపోతుంది. మీరు ఈ మెంతులను కనీసం 8 గంటల పాటు నీటిలో నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మెంతులను పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. కావాలంటే దీనిలో పెరుగు కలుపుకోవచ్చు. మెంతుల్లో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ మెంతులు జుట్టు పెరగడానికి చాలా బాగా సహాయపడతాయి. కావాలంటే..మీరు బాదం నూనె, కొబ్బరి నూనె కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. వీటిని జుట్టుకు బాగా పట్టించి... గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
అరటి హెయిర్ మాస్క్:
2 పండిన అరటిపండ్లు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా మీ తలకు పట్టించి, మరుసటి రోజు ఉదయం కడిగేయండి. దీన్ని మీ తలకు అప్లై చేసిన తర్వాత, షవర్ క్యాప్ ధరించండి. ఈ మిశ్రమంలో సహజ నూనెలు, విటమిన్లు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది జుట్టు రాలడం సమస్యలకు అద్భుతమైన పరిష్కారం.