Face Glow: చలికాలంలో చలికి తట్టుకోలేక వేడి నీటి స్నానం చేసినా, దాహం వేయడం లేదని నీరు తాగకపోయినా దాని ఎఫెక్ట్ స్కిన్ మీద పడుతుంది. అందుకే, ఈ సీజన్ లో స్కిన్ బాగుండాలంటే కొన్ని పొరపాట్లు చేయకూడదు.
చలికాలం ఆల్రెడీ మొదలౌంది. చలికాలం చాలా మందికి నచ్చుతుంది. కానీ ఈ సీజన్ లో చలికి స్కిన్ చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ముఖం, చేతులు బాగా కగిలిపోతాయి. మంట కూడా పుడుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ముఖం పగిలింది అనిపిస్తే... ఏం రాయాలి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం....
25
1.మాయిశ్చరైజర్ తప్పక వాడాలి...
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడాలి. స్నానం చేసిన వెంటనే చర్మం కొంచెం తడిగా ఉన్నప్పుడు క్రీమ్ లేదా బాడీ లోషన్ అప్లై చేస్తే... తేమ ఎక్కువసేపు నిలుస్తుంది. కోకూ బట్టర్, షియా బట్టర్, ఆలివ్ ఆయిల్, బాదం నూనె వంటి పదార్థాలు ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకోవడం ఉత్తమం.
నీరు ఎక్కువగా తాగాలి....
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మందికి దాహం వేయదు. దీంతో నీరు తాగరు. దీని వల్ల చర్మం పొడిగా మారుతుంది. అందుకే, మర్చిపోకుండా ప్రతి రోజూ 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. దీని వల్ల చర్మం హైడ్రేటెడ్ గా మారుతుంది.
35
వేడి నీటితో స్నానం చేయకూడదు...
వేడి నీరు శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది కానీ చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తుంది. ఆ కారణంగా చర్మం ఇంకా ఎండిపోతుంది.కాబట్టి గోరువెచ్చని నీటితోనే స్నానం చేయవచ్చు. కానీ, ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు.
లిప్ బామ్‌ను ఎప్పుడూ వెంట పెట్టుకోండి
చల్లని గాలుల్లో పెదాలు ఎక్కువగా పగిలిపోతాయి. షియా బట్టర్, కొబ్బరి నూనె, బీ వాక్స్ ఉన్న లిప్ బామ్ పెదాలను మృదువుగా ఉంచుతాయి.
రాత్రివేళ చర్మం బాగా రిపేర్ అవుతుంది. అందుకే పడుకునే ముందు నైట్ క్రీమ్ లేదా హోమ్‌మేడ్ నైట్ సీరమ్ అప్లై చేయండి.కలబంద జెల్ + విటమిన్ E + బాదం నూనె మిశ్రమం శీతాకాలానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ పగిలిపోకుండా.. అందంగా కనపడుతుంది.
శీతాకాలంలో చర్మం తేమగా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యమే.
కొబ్బరి నీరు తాగాలి. నారింజ, పుచ్చకాయ, జామ పండు లాంటివి తినవచ్చు. ఓట్స్ తిన్నా కూడా ఈ సీజన్ లో మీ ముఖం అందంగా కనపడుతుంది. బాదం, ఆక్రోట్ వంటివి డైట్ లో భాగం చేసుకోవాలి. ఇవన్నీ చర్మానికి లోపలి నుంచి గ్లో అందిస్తాయి.
55
వారంలో ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోండి
శీతాకాలం ప్రత్యేక ప్యాక్ వాడటం వల్ల కూడా చర్మం అందంగా కనపడుతుంది. దీని కోసం మీరు కలబంద జెల్ + తేనె + పసుపు ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చాలు. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. గ్లోగా కనపడుతుంది.
ఫైనల్ గా...
శీతాకాలంలో చర్మం పొడిబారడం సహజం కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. తేమను కాపాడే అలవాట్లు, మంచి ఆహారం, సరైన నైట్ కేర్ తీసుకుంటే.... చర్మం అందంగా కనపడుతుంది.