అరటి తొక్కను ఇలా వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!

Published : Nov 15, 2025, 06:19 PM IST

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రోడక్టులను వాడుతుంటారు. కానీ అరటి తొక్కను ఎప్పుడైనా ట్రై చేశారా? అరటి తొక్క జుట్టు పెరగడానికి చక్కగా పనిచేస్తుంది. మరి దాన్ని ఎలా వాడాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
15
అరటి తొక్క ప్రయోజనాలు

మృదువైన, పొడవైన జుట్టు కోసం ఆడవాళ్లు చేయని ప్రయత్నాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. జుట్టు ఆరోగ్యం కోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే కొన్ని ప్రోడక్టుల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల జుట్టుకు హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి జుట్టు సమస్యలకు సహజ పదార్థాలను వాడటం మంచిది. అలాంటి సహజ పరిష్కారాల్లో ఒకటి అరటి తొక్క. దీన్ని జుట్టుకు వాడటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు ఇది చక్కగా సహాయపడుతుంది. కుదుళ్లు బలపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి అరటి తొక్కను ఎలా వాడాలో తెలుసుకుందామా..

25
అరటి తొక్కలోని పోషకాలు

అరటి తొక్కలో పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ A, మెగ్నిషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరటి తొక్కలోని పొటాషియం జుట్టు ఫోలికల్స్‌ని బలపరుస్తుంది. విటమిన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అరటి తొక్కను రెగ్యులర్ గా వాడితే, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారుతుంది.

35
అరటి తొక్క వాడే విధానం

ఒకటి లేదా రెండు అరటి తొక్కలను తీసుకొని.. చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించాలి. చిన్నగా మసాజ్ చేయాలి. 20 నుంచి 30 నిమిషాల వరకు ఆ హెయిర్ మాస్క్ ను అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత.. నార్మల్ షాంపూతో గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 1–2 సార్లు చేయడం ద్వారా జుట్టు పెరుగుదల బాగుంటుంది.  

45
ఇవి గుర్తుంచుకోండి

అరటి తొక్క వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొంతమందికి పడకపోవచ్చు. ర్యాషెస్ లేదా ఇర్రిటేషన్ కలిగించవచ్చు. కాబట్టి వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అవసరం. అంతేకాదు ఈ పేస్టును ఎక్కువసార్లు ఎక్కువ మోతాదులో వాడకూడదు. కాస్త చిన్న జుట్టు ఉన్నవారు 2 నుంచి 3 స్పూన్లు, మీడియం ఉన్నవారు 4-5 స్పూన్లు, పొడవైన జుట్టు ఉన్నవారు 7 నుంచి 9 స్పూన్ల వరకు పెట్టుకోవచ్చు. 

55
మంచి ఆహారం

జుట్టు పెరగడానికి అరటి తొక్కను ఉపయోగించడంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, జింక్ వంటి పోషకాలు జుట్టు కుదుళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పులు, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories