Skin Care: ఈ ఐదు పండ్లు రోజూ తింటే మీ ఏజ్ పెరగదు..!

అందంగా కనిపించడానికి ఖరీదైన క్రీములు, సీరమ్స్ రాయాల్సిన అవసరం లేదు. కేవలం  ఐదు రకాల పండ్లు తిన్నా చాలు. మీ వయసు తగ్గుతుంది. ముఖంపై ముడతలు లాంటివి కూడా రావు.

5 anti ageing fruits to eat daily in telugu ram
glowing skin

వయసు పెరుగుతున్నా యవ్వనంగా మెరిసిపోవాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? చర్మం మెరుస్తూ , ముఖంపై ముడతలు లేకుండా 40 ఏళ్లు దాటినా కూడా 20 ఏళ్ల యువతిలా కనిపిస్తే ఎంత బాగుంటుంది. కానీ, దానికోసం ఖరీదైన క్రీములు, సీరమ్స్ రాయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఐదు పండ్లను తిన్నా చాలు.  యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, నీటి కంటెంట్ , ఫైబర్లతో నిండి ఉండే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల వృద్ధాప్యాన్ని తగ్గించేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దాని వల్ల యవ్వనంగా కనపడటానికి సహాయపడుతుంది.మరి, ఎలాంటి పండ్లు రోజూ తినాలో తెలుసుకుందాం...

5 anti ageing fruits to eat daily in telugu ram
Eat blue berries every day

1.బ్లూబెర్రీస్..
యాంటీ ఏజింగ్ ఫుడ్స్ లో బ్లూ బెర్రీస్ ముందు వరసలో ఉంటాయి. ఈ చిన్న పండు క్రమ తప్పకుండా రోజూ మన డైట్ లో భాగం చేసుకుంటే చాలు. యవ్వనంగా మెరిసిపోతారు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఆంథోనిసైనిన్లు యవ్వనంగా మార్చడంలో సహాయం చేస్తాయి.

బ్లూబెర్రీస్ అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారకమైన ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అవి మీ చర్మ కణాలను పర్యావరణ నష్టం నుండి రక్షిస్తాయి.మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. కేవలం ముఖం మెరిచేలా చేయడమే కాదు, కంటి చూపు మెరుగుపరచడంలోనూ,  జ్ఞాపకశక్తి  పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. వీటిని ఎలా తినాలి అంటే, స్మూతీలో వీటిని చేర్చుకోవచ్చు. లేదంటే.. గ్రీక్ యోగర్ట్ లో కలుపుకొని అయినా తినవచ్చు. 
 


2.దానిమ్మ..

దానిమ్మ పండు రోజూ తింటే కూడా యవ్వనంగా మెరిసిపోవచ్చు . దానిమ్మలో పాలిఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా మిమ్మల్ని యవ్వనంగా మారుస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు లాంటివి రావు. వచ్చిన ముడతలను కూడా తగ్గించేస్తాయి. వీటిని మనం డైరెక్ట్ గా గింజలుగా అయినా తీసుకోవచ్చు. లేదంటే జ్యూస్  రూపంలో అయినా తీసుకోవచ్చు. వారానికి ఒకసారి తీసుకున్నా.. మీ స్కిన్ లో వచ్చే మార్పులను క్లియర్ గా చూడొచ్చు.

3.అవకాడో..
అవకాడో కూడా మీ అందాన్నిపెంచడంలో సహాయం చేస్తుంది. అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి లోపలి నుంచి చర్మానికి పోషణ అందిస్తాయి.దీనిలో విటమన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యవ్వనంగా చేయడంలోనూ,అందంగా కనిపించేలా చేయడంలోనూ సహాయం చేస్తుంది. ఇది వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. కాలేయ పనితీరు మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. స్కిన్ ని హైడ్రేటెడ్ గా మార్చడంలోనూ సహాయం చేస్తుంది.దీనిని మీరు టోస్ట్ రూపంలో కూడా తినవచ్చు.
 

4.బొప్పాయి..

బొప్పాయి పండు ఎంత రుచిగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే బొప్పాయి పండు అందాన్ని పెంచడంలోనూ సహాయం చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. పపైన్ అనే ఎంజైమ్ తో పాటు సున్నితమైన ఎక్స్ ఫోలిచచేటింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల యవ్వనంగా మార్చడంలో సహాయం చేస్తాయి. రెగ్యులర్ గా ఈ పండు తినడం వల్ల ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖంపై గీతలు, ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పండు తినడంతో పాటు.. ఫేస్ మాస్క్ కూడా వేసుకోవచ్చు.

5.పుచ్చకాయ..
సమ్మర్ లో లభించే బెస్ట్ పండు ఏదైనా ఉంది అంటే అది పుచ్చకాయ. ఇది మనల్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. దీనిలో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని యవ్వనంగా మార్చడంలో సహాయం చేస్తాయి. స్కిన్ ఎప్పుడూ మృదువుగా మార్చడంలో సహాయం చేస్తుంది.

Latest Videos

vuukle one pixel image
click me!