భారత్‌లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు ఇవే!
Top 10 Must See Destinations in India: భారత్‌లో చూడాల్సిన అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, తాజ్ మహల్ నుంచి కేరళ బ్యాక్‌వాటర్స్ వరకు టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Top 10 Must See Destinations in India: భారత్‌లో చూడాల్సిన అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, తాజ్ మహల్ నుంచి కేరళ బ్యాక్‌వాటర్స్ వరకు టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించాడు. అద్భుతమైన నిర్మాణంతో చూపుతిప్పుకోనివ్వదు.
పింక్ సిటీ జైపూర్ చారిత్రాత్మకమైన ప్యాలెస్‌లకు ఫేమస్. ఇక్కడి హవా మహల్, సిటీ ప్యాలెస్ జైపూర్ అందాన్ని పెంచుతాయి.
కేరళ బ్యాక్‌వాటర్స్‌ను సౌత్ వెనిస్ అని అంటారు. ఇది కేరళలోని కోస్టల్ ప్లెయిన్‌లో ఉన్న సరస్సులు, కాలువల నెట్‌వర్క్.
మంచుతో కప్పబడిన పర్వతాలు, మంచి వ్యూస్‌తో లేహ్-లడఖ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఇది నేచర్ లవర్స్‌కి స్వర్గంలాంటిది.
ఉదయపూర్ రాజస్థాన్‌లో ఒక ముఖ్యమైన టూరిస్ట్ ప్లేస్. సరస్సుల నగరం అని పిలుస్తారు. ఇది సరస్సులు, ప్యాలెస్‌లకు ఫేమస్.
గోవాలో చాలా అందమైన బీచ్‌లు ఉన్నాయి. సాంస్కృతిక అనుభవాలు పంచుతాయి. ఇక్కడ క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.
వారణాసి ప్రపంచంలో పురాతన నగరం. ఇది గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్‌లకు, ఆధ్యాత్మిక వాతావరణానికి చాలా ఫేమస్. చాలా మంది ఇక్కడకు వస్తుంటారు.
శ్రీనగర్‌ను భూమిపై స్వర్గం అంటారు. ఇది కాశ్మీర్ లోయలో జీలం నది ఒడ్డున ఉంది. ఇది నేచర్ లవర్స్‌కి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.
హంపి కర్ణాటకలో ఉంది. దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఇది పురాతన దేవాలయాలకు ఫేమస్.
ఇది రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ పులులు ఉంటాయి. ఇది నేచర్ లవర్స్‌కి పర్ఫెక్ట్ టూరిస్ట్ ప్లేస్.