పాకిస్థాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ హైజాక్ తర్వాత బలూచిస్తాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్ నుండి తమ ప్రాంతానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ హైజాక్ చేసింది. ఈ క్రమంలో బలూచిస్తాన్ ఓ దేశం ఏర్పాటుచేసేంత విస్తీర్ణంలో ఉందా? అక్కడ ఎలాంటి ఆదాయ వనరులు ఉన్నాయి? అనే చర్చ జరుగుతోంది. కాబట్టి బలూచిస్తాన్ లోని టాప్ 10 పర్యాటక ప్రాంతాలు గురించి తెలుసుకుందాం.
హన్నా సరస్సు : పచ్చని కొండల మద్య స్వచ్చమైన నీటితో నిండివుంటుంది ఈ హన్నా సరస్సు. కుటుంబంతో కలిసి సరదాగా పిక్నిక్ కు వెళ్లాలనుకునేవాారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. బోటింగ్ చేయడానికి ఇది చాలా మంచి ప్రదేశం.