రాాత్రులు రైల్లో ఫోన్ చార్జింగ్ చేయలేము ... కారణమేంటో తెలుసా?

Published : Mar 21, 2025, 02:54 PM IST

Train Travel Rules: దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. వారి భద్రత కోసం భారతీయ రైల్వే అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలా రాత్రిపూట రైల్వే ప్రయాణాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయో తెలుసుకుందాం.     

PREV
18
రాాత్రులు రైల్లో ఫోన్ చార్జింగ్ చేయలేము ... కారణమేంటో తెలుసా?
Indian Railways

భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు... ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు రాత్రులు రైళ్ళలో ప్రయాణించేవారు ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో రైల్వే సిబ్బంది అందుబాటులో ఉండరు... ఎవరిని సంప్రదించాలో కూడా తెలియదు.

అయితే రాత్రులు రైల్లో ప్రయాణించేవారి భద్రత కోసం రైల్వే శాఖ కొన్ని నియమనిబంధనలు రూపొందించింది. వీటిని పాటిస్తే ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చు. వాటిగురించి తెలుసుకుందాం. 

 

28
Indian Railways

 రైల్వే సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్స్ ని రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ఛాఫ్ చేస్తారు. ఒకవేళ మీరు మొబైల్ ఛార్జ్ చేయాలంటే 11 గంటలకు ముందే చేసుకోండి. లేదంటే తెల్లవారుజాము వరకు ఇబ్బందిపడాల్సి  ఉంటుంది. 

38
Indian Railways

ఏసి కోచ్‌లో ప్రయాణిస్తుంచేవారు ఓ విషయం గుర్తుంచుకోండి. రాత్రిపూట ఎవరైనా బెడ్‌షీట్లు, దిండ్లు అంటూ వస్తే నమ్మకండి. ఎందుకంటే రైల్వే సిబ్బంది మాత్రమే వీటిని ఇస్తారు.  

48
Indian Railways

రాత్రిపూట లోయర్ బెర్త్ మీద నిద్రిస్తున్న ప్రయాణికులను డిస్టర్బ్ చేయడం రైల్వే రూల్స్‌కి వ్యతిరేకం. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

58
Indian Railways

రాత్రిపూట రైలులో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత కోసం పురుషులు మహిళల కోచ్‌లోకి వెళ్లకూడదు. అలా చేస్తే శిక్ష పడుతుంది.

68
Indian Railways

రాత్రిపూట అక్రమ విక్రేతల నుండి వస్తువులు కొనడం నిషేధం. చాలా సార్లు వీళ్లు నకిలీ వస్తువులు అమ్ముతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

78
Indian Railways

రైలులో మద్యం సేవించి ప్రయాణికులను డిస్టర్బ్ చేస్తే శిక్షార్హమైన నేరం. ఒకవేళ ఎవరైనా మత్తులో ఉంటే జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది.

88
Indian Railways

రాత్రి 10 గంటల తర్వాత టికెట్ కలక్టర్ (TTE) మీ టికెట్లను చెక్ చేయడానికి రాలేరు. ఒకవేళ వస్తే మీరు కంప్లైంట్ చేయవచ్చు. ఇది రైల్వే రూల్.

Read more Photos on
click me!

Recommended Stories