ఉల్లిపాయ లేకుండా ఏ కూర చేయలేము. అందుకే వాటిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటాం. కానీ వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడైపోతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
వంటింట్లో ఉపయోగించే పదార్థాల్లో ఉల్లిపాయలు ముందువరుసలో ఉంటాయి. ఉల్లిపాయలు లేకుండా ఏ వంట చేయలేము. కూర చేయాలన్నా, చట్నీ చేయాలన్నా ఉల్లిపాయలు తప్పనిసరి. అందుకే చాలామంది ఎక్కువ మొత్తంలో వీటిని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటారు. మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి వాటిని సరిగ్గా నిల్వ చేయడం ముఖ్యం. మరి ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
25
తాజా ఉల్లిపాయలను..
ఉల్లిపాయలను కొనుగోలు చేసేటప్పుడు తాజాగా ఉన్నవి ఎంచుకోండి. రంగు మారిన లేదా మెత్తబడిన ఉల్లిపాయలను తీసుకోవద్దు. మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే ఉల్లిపాయలను నిల్వ చేయకూడదు. ముందుగా కాసేపు ఆరబెట్టాలి.
35
గాలి తగిలేలా నిల్వ చేయాలి..
ఉల్లిపాయలను ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయకూడదు. గాలి సరిగ్గా తగలకపోవడం వల్ల త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని వెడల్పాటి బుట్టల్లో నిల్వ చేయడం మంచిది. గాలి బాగా తగిలి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
ఉల్లిపాయలను బంగాళాదుంపలు, పచ్చిమిర్చి వంటి ఇతర కూరగాయలతో కలిపి నిల్వ చేయకూడదు. ఇవి విడుదల చేసే ఇథిలీన్ వాయువు వల్ల ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది.
55
సరైన స్థలంలో..
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉల్లిపాయలు త్వరగా కుళ్లిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఉల్లిపాయలను తేమ నుంచి దూరంగా ఉంచాలి. బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి.