Beauty tips: ఈ 6 రకాల పూలతో మెరిసే చర్మం, పొడవైన జుట్టు మీ సొంతం!

Published : Jul 12, 2025, 05:49 PM IST

మెరిసే చర్మం, పొడవైన జుట్టు కోసం చాలామంది చాలారకాల చిట్కాలు పాటిస్తుంటారు. ఖరీదైన ప్రోడక్టులు వాడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని రకాల పూలతో జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.  

PREV
17
చర్మం, జుట్టుకు పూల మహిమలు
చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే పూలు..

అందమైన చర్మం, ఒత్తైన జుట్టును అందరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల బ్యూటీ ప్రోడక్టులు వాడుతుంటారు. కొన్నిసార్లు వాటివల్ల మంచి కంటే.. చెడు జరిగే అవకాశాలే ఎక్కువ. అయితే కొన్ని రకాల పూలతో జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పూలలోని సహజ గుణాలు చర్మం, జుట్టును అందంగా మారుస్తాయి. మరి ఆ పూలేంటో చూద్దామా..  

27
సన్ ఫ్లవర్

పొద్దు తిరుగుడు పువ్వులు చర్మ ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడతాయి. ఈ పూలను ఎండబెట్టి అందులో గులాబీనీరు లేదా పాలు కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనివల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.

37
గులాబీ

గులాబీ పువ్వు చర్మానికి చల్లదనాన్ని, తేమను అందిస్తుంది. మొటిమల సమస్య ఉన్నవారికి గులాబీనీరు ఉపశమనం కలిగిస్తుంది. గులాబీ.. చర్మంపై మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతుంది.  

47
కలువ పూలు

కలువ పూలు చర్మ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. ఎరుపుదనం, దద్దుర్లు, మొటిమలు వంటివి తగ్గుతాయి. ఈ పూలతో ఫేస్ ప్యాక్ వేసుకుని, కొంత సమయం తర్వాత కడిగేయాలి. అయితే వాడే ముందు ప్యాచ్ టెస్ట్ కచ్చితంగా చేసుకోవాలి.

57
తామర పూలు

గులాబీలాగే, తామర పూలు చర్మాన్ని చల్లబరుస్తాయి. ఈ పూలు యాంటీమైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. తామర పూల ఫేస్ ప్యాక్ చర్మకాంతిని పెంచి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.

67
మందార పువ్వు

మందార పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ పూలు, ఆకులు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులోని విటమిన్-సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటివి జుట్టును బలపరుస్తాయి. పెరుగుదలకు తోడ్పడుతాయి.

77
మల్లె

మల్లెపూలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొటిమల సమస్య ఉంటే మల్లెపూలు మరిగించిన నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, మొటిమలను తగ్గిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories