Hair care tips: బట్టతలపై జుట్టు పెరగాలంటే.. ఆలివ్ ఆయిల్ లో ఇవి కలిపి రాస్తే చాలు!

Published : Jul 12, 2025, 03:57 PM IST

ప్రస్తుతం చాలామంది చిన్నవయసులోనే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆలివ్ ఆయిల్ తో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికే కాదు.. జుట్టు పెరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ చూద్దాం.  

PREV
16
జుట్టు పెరుగుదలకు ఆలివ్ నూనె..

జుట్టు రాలడం సాధారణ సమస్యే అయినప్పటికీ.. ఇది చాలామందిని కలవరపెడుతోంది. బట్టతల వల్ల అందంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అయితే ఆలివ్ ఆయిల్ తో ఈ సమస్య నుంచి కొంతమేర ఉపశమనం పొందవచ్చు. ఈ నూనెలో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెంట్రుకలు రాలిపోయిన చోట తిరిగి వేగంగా పెరగడానికి ఆలివ్ నూనెను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.

26
బట్టతలపై ఆలివ్ నూనెను ఎలా వాడాలి?

తగినంత ఆలివ్ నూనెను తీసుకుని దాన్ని కొద్దిగా వేడి చేయాలి. దాన్ని బట్టతలపై వేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. పది నిమిషాలపాటు నిదానంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల బట్టతలపై రక్త ప్రసరణ మెరుగవతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందుతాయి. జుట్టు పెరగడం ప్రారంభం అవుతుంది.

36
తేనె, ఆలివ్ నూనె :

ఒక చెంచా ఆలివ్ నూనెలో ఒక చెంచా తేనె కలిపి బట్టతలపై రాసి మసాజ్ చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి.. తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. తేనెలోని అలెర్జీ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు.. తలపై ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తాయి. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

46
ఉల్లి రసం, ఆలివ్ నూనె :

ఒక చెంచా ఉల్లి రసంలో ఒక చెంచా ఆలివ్ నూనె కలిపి బట్టతలపై రాసి 30 నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఉల్లి రసంలోని సల్ఫర్ వెంట్రుకలు రాలడాన్ని తగ్గించి, కొత్త వెంట్రుకలు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతిని వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

56
గుడ్డు, ఆలివ్ నూనె:

ఒక గుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల ఆలివ్ నూనె కలిపి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. పచ్చసొనలో ఉండే ప్రోటీన్, విటమిన్లు, బయోటిన్ వెంట్రుకలను బలపరుస్తాయి. జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

66
కలబంద జెల్, ఆలివ్ నూనె :

2 చెంచాల ఆలివ్ నూనెతో 1 చెంచా తాజా కలబంద జెల్ కలిపి బట్టతలపై అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. కలబంద జెల్ ఆరోగ్యకరమైన వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories