Teeth Whitening Remedies: వీటిలో ఏ ఒక్కటి చేసినా పళ్లు తెల్లగా మెరిసిపోవడం పక్కా!

Published : Aug 06, 2025, 04:47 PM IST

పళ్లు తెల్లగా, ముత్యాల్లా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రకరకాల కారణాల వల్ల పళ్లపై పచ్చటి చారలు వస్తుంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో పళ్లు తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.  

PREV
16
పళ్లను తెల్లగా మార్చే చిట్కాలు

ముత్యాల్లాంటి తెల్లటి పళ్లు అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంతమందికి రకరకాల కారణాల వల్ల పళ్లు పచ్చగా మారుతుంటాయి. దానివల్ల వారు నలుగురిలో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు. అయితే సరైన పద్ధతిలో పళ్లను శుభ్రం చేసుకోవడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీ పళ్లు కూడా తెల్లగా మెరిసిపోవాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.  

26
జామ ఆకులు

జామ ఆకులను శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పళ్లపై ఉన్న పసుపు మచ్చలు తొలగిపోయి తెల్లగా మారుతాయి. అంతేకాదు పంటినొప్పి, మురికి, క్రిములను కూడా జామాకు తొలగిస్తుంది.

36
కలబంద జెల్

కలబంద జెల్ కూడా పళ్లపై పసుపు మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. అందుకోసం కలబంద జెల్ ను దంతాలపై రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పళ్లు తెల్లగా మెరుస్తాయి. చిగుళ్లు కూడా దృఢంగా మారుతాయి. 

46
ఆరెంజ్ తొక్క

రాత్రి పడుకునే ముందు ఆరెంజ్ తొక్కను పళ్లపై రుద్ది, తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్కలో ఉండే విటమిన్ సి దంతాలు, చిగుళ్లపై పేరుకుపోయిన బాక్టీరియా, క్రిములు, మచ్చలను తొలగిస్తుంది. పళ్లను తెల్లగా, దృఢంగా మారుస్తుంది.

56
ఉప్పు

దంత సమస్యలకు ఉప్పు చక్కగా పనిచేస్తుంది. ఉప్పును పళ్లపై రుద్దితే మచ్చలు తొలగిపోతాయి. కానీ ఉప్పును ఎక్కువగా వాడటం మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా వేసి రుద్దితే పంటి ఎనామిల్, చిగుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.

66
యాపిల్

ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే పళ్లపై పేరుకుపోయిన పసుపు మచ్చలు తొలగిపోతాయి. ఆపిల్ మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

చాక్లెట్, స్వీట్లు వంటివి తిన్న వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం మంచిది. పిల్లలకు కూడా ఈ అలవాటు నేర్పించాలి. అప్పుడే పళ్లు తెల్లగా, ఆరోగ్యంగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories