వర్షాకాలంలో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ముఖ్యంగా కిచెన్, బాత్రూమ్ లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అయితే కొన్ని చిట్కాలతో బొద్దింకలను తరిమి కొట్టవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
వర్షాకాలంలో తేమ, మురికి వల్ల బొద్దింకల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా బాత్రూమ్‌లు, వంటగదుల్లో బొద్దింకల సైన్యం బీభత్సం సృష్టిస్తుంది. ఏ మూలలో చూసినా అవే కనిపిస్తాయి. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాలతో బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమి కొట్టవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.
26
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి
బొద్దింకలు ఎక్కువగా రావడానికి కారణం అపరిశుభ్ర వాతావరణం. కాబట్టి ఇంటిని పొడిగా, శుభ్రంగా ఉంచండి. దానివల్ల బొద్దింకల సమస్య తగ్గుతుంది. మురికి పాత్రలను వెంటనే శుభ్రం చేయండి. ఆహార పదార్థాలపై మూతపెట్టి ఉంచండి.
36
బేకింగ్ సోడాతో..
బేకింగ్ సోడా, పంచదారతో బొద్దింకల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక గిన్నెలో సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, పంచదార కలపండి. బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో చల్లండి. పంచదార వాటిని ఆకర్షిస్తుంది. బేకింగ్ సోడా తిన్న వెంటనే అవి చనిపోతాయి.
వేప.. బొద్దింకలకు సహజ శత్రువు. వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయండి. లేదా ఇంట్లోని మూలల్లో వేప ఆకులు వేయండి. దీని ఘాటైన వాసన బొద్దింకలను తరిమి కొడుతుంది. ఈ పద్ధతి చాలా సురక్షితం. పర్యావరణానికి కూడా మంచిది.
56
బోరాక్స్ పౌడర్
బోరాక్స్ పౌడర్‌ను పంచదార లేదా పిండితో కలిపి చిన్న ఉండలుగా చేయండి. వాటిని వంటగది, అల్మారాలు లేదా తడిగా ఉండే ప్రదేశాల్లో ఉంచండి. వాటిని తిన్న తర్వాత బొద్దింకలు చనిపోతాయి. పిండి ఉండలను.. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి.
66
పగుళ్లు, రంధ్రాలు ఉంటే..
బొద్దింకల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఇంటి గోడలు, పగుళ్లను మూసివేయండి. వర్షాకాలంలో రంధ్రాలు, పగుళ్లు సర్వసాధారణం. బొద్దింకలు ఈ పగుళ్లలో నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. కాబట్టి ఈ రంధ్రాలను సిమెంట్, లేదా సిలికాన్‌తో మూసివేయండి. ఇది బొద్దింకల ప్రవేశాన్ని ఆపుతుంది.