Hair Care: జుట్టు రాలడం వెంటనే ఆగిపోవాలంటే.. వీటిలో ఏ ఒక్కటి రాసినా చాలు!

Published : Jul 31, 2025, 02:02 PM IST

ప్రస్తుతం చాలామందిని జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు చాలామంది ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.  

PREV
15
ఇంట్లోనే హెయిర్ మాస్క్‌తో జుట్టు సమస్యలకు బైబై చెప్పండి
జుట్టు సమస్యలను తగ్గించే చిట్కాలు

ప్రస్తుతం చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నివారించడానికి కొంతమంది మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తే... మరికొందరు పార్లర్‌లకు వెళ్లి హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. దానివల్ల జుట్టుకు హాని కలిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే కొన్ని సహజ పదార్థాలతో జుట్టు సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.  

25
పెరుగు, ఆపిల్ సైడర్ వెనిగర్

పెరుగు, ఆపిల్ సైడర్ వెనిగర్, తేనెతో కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఒక గిన్నెలో అరకప్పు పెరుగు తీసుకుని, దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కొనల నుంచి వేర్ల వరకు పట్టించాలి. కొంతసేపు అలాగే ఉంచి షాంపూతో కడిగేయాలి. ఇది జుట్టు రాలే సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. దృఢమైన జుట్టు మీ సొంతమవుతుంది. 

35
గుడ్డు, పాలు

ఒక గిన్నెలో గుడ్డు పచ్చ సొన తీసుకోండి. దానికి అరకప్పు పాలు కలపండి. తర్వాత దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేయండి. కొద్దిగా ఆలివ్ నూనె కలపండి. బాగా కలిపి ప్యాక్ తయారు చేయండి. 

ఈ మిశ్రమాన్ని జుట్టు వేర్ల నుంచి చివరి వరకు పట్టించండి. కొంతసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత షాంపూతో కడిగేయండి. గుడ్డు, పాలు జుట్టుకు పోషణనిస్తాయి. నిమ్మకాయ చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య త్వరలోనే తగ్గిపోతుంది.

45
అరటి పండు, కొబ్బరి నూనె

అరటి పండు, కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. సగం అరటిపండు తీసుకుని దాన్ని చిదిమేయాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. రెండింటిని బాగా కలిపి ప్యాక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా పట్టించి.. కొంతసేపటి తర్వాత షాంపూతో కడిగేయాలి. 

55
ఆముదం, కొబ్బరినూనె

ఆముదం, కొబ్బరి నూనె, కలబంద జెల్‌తో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ముందుగా కలబంద జెల్‌ లో కొబ్బరి నూనె, ఆముదం కలపాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఆరిన తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి.  

గుడ్డు, పెరుగు

ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోవాలి. దానికి 2 స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత షాంపూ చేయాలి. వారానికి ఒకసారి ఈ మాస్క్ వాడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. నల్లని, ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories