బియ్యం నీటిలో ఈ 2 కలిపి జుట్టుకు రాస్తే చాలు.. ఒక్క వెంట్రుక కూడా రాలదు!

Published : Sep 02, 2025, 03:40 PM ISTUpdated : Sep 02, 2025, 03:45 PM IST

రైస్ వాటర్.. జుట్టు ఆరోగ్యానికి ఎంతమంచిదో మనకు తెలుసు. వీటిని రెగ్యులర్ గా జుట్టుకు పట్టించడం ద్వారా మంచి ఫలితాలు చూడవచ్చు. అయితే బియ్యం నీటిలో రెండు పదార్థాలు కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుందట. అవేంటో ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
బియ్యం నీటి ప్రయోజనాలు

ప్రస్తుతం చాలామంది రకరకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యమైనవి జుట్టు రాలడం, తెగడం, తెల్లబడటం వంటివి. అయితే రైస్ వాటర్ ని ఉపయోగించడం ద్వారా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బియ్యం నీటిలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించి.. పెరుగుదలకు తోడ్పడుతాయి.

24
మెంతులు, కరివేపాకు ప్రయోజనాలు

బియ్యం నీటిలో మెంతులు, కరివేపాకు వేసి వాడటం ద్వారా మెరుగైన ఫలితాలు చూడవచ్చు. తక్కువ టైంలో జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది. మెంతులలో ఉండే ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు మెంతుల్లోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. కరివేపాకులో ఉన్న ఐరన్, బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి. జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తాయి.  

34
తయారీ విధానం

ఒక గ్లాస్ నీటిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 10–15 కరివేపాకులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు అప్లై చేయాలి. అరగంట నుంచి గంట వరకు అలాగే ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. 

44
వారానికి రెండుసార్లు

బియ్యం, మెంతులు, కరివేపాకు నానబెట్టిన నీటిని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. అయితే వాడిన ప్రతీసారి ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. మొదటిసారి వాడే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరికీ వీటివల్ల దురద, మంట రావచ్చు. కాబట్టి చెక్ చేసుకొని వాడటం ఉత్తమం. 

Read more Photos on
click me!

Recommended Stories