మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా బాత్రూమ్ క్లీన్ గా లేకపోతే.. ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండదు. అయితే ఈ ఒక్క పౌడర్ తో బాత్రూమ్ ని మెరిసేలా చేయవచ్చు. అదేంటో.. ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
మనలో చాలామంది కాఫీ తాగిన తర్వాత.. వాడిన కాఫీ పొడిని పారేస్తుంటారు. కానీ కాఫీ పొడి.. మీ బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుందనే విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కాఫీ పొడి బాత్రూమ్ శుభ్రం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దుర్వాసనను కూడా తొలగిస్తుంది. మరి కాఫీ పొడిని బాత్రూమ్ క్లీనింగ్ కి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
25
కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలి?
బాత్రూమ్‌ను శుభ్రం చేయడానికి రసాయన ఆధారిత ఉత్పత్తులను వాడే బదులు.. కాఫీ పొడిని వాడటం మంచిది. దీంట్లో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు. కాఫీ పొడి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది. బాత్రూమ్‌ను మెరిసేలా చేస్తుంది. బాత్రూమ్ లో ఒక చెంచా కాఫీ పొడి వేసి బ్రష్‌తో రుద్దితే చాలు.. మురికి, మరకలు, దుమ్ము సులభంగా పోతాయి.
35
దుర్వాసన రాకుండా
కాఫీ పొడిలోని సహజ నూనెలు, బాక్టీరియా నిరోధక గుణాలు బాత్రూమ్‌ను శుభ్రపరచడమే కాకుండా, దుర్వాసనను కూడా తొలగిస్తాయి. సాధారణంగా రసాయన క్లీనర్లు కఠినమైన, ఘాటైన వాసనలను కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించిన తర్వాత బాత్రూమ్ నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. కానీ కాఫీపొడి వాడినప్పుడు దాని పరిమళం బాత్రూమ్ అంతా వ్యాపిస్తుంది.
మనం కొన్నిసార్లు ఎక్కువ రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు వెళ్లే ముందు బాత్రూమ్‌లో ఒక చెంచా కాఫీ పొడిని చల్లండి. ఇది బాత్రూమ్ నుంచి దుర్వాసనను తొలగించడంతో పాటు క్లీన్ గా నీట్ గా ఉంచుతుంది.
55
డబ్బు ఆదా..
కాఫీ పొడి వాడకం సులభం మాత్రమే కాదు.. డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఖరీదైన, కఠినమైన రసాయనాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. వాడిన కాఫీ పొడిని పారేయకుండా, ఒక డబ్బాలో దాచి అవసరమైనప్పుడు వాడుకుంటే సరిపోతుంది.