కిచెన్ క్లీన్ గా, నీట్ గా ఉంటేనే అక్కడ తయారు చేసే ఫుడ్ బాగుంటుంది. కానీ కిచెన్ లో ఎక్కువశాతం సింక్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, ఇతర కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
కిచెన్ సింక్ ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మురికి, ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సింక్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో సింక్ ని మెరిసేలా చేయవచ్చు. దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..
25
కిచెన్ సింక్ దుర్వాసన నివారించే చిట్కాలు
బేకింగ్ సోడా, వెనిగర్
సింక్ లో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి బేకింగ్ సోడా, వెనిగర్ చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఒక కప్పు బేకింగ్ సోడాను సింక్ డ్రెయిన్‌లో పోయాలి. తర్వాత ఒక కప్పు వెనిగర్ జల్లాలి. 15–20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేయాలి. సింక్ శుభ్రం అవుతుంది. మంచి వాసన కూడా వస్తుంది.
35
వేడి నీటిని పోయడం
సింక్ లో మనం వంటపాత్రలను రోజూ కడుగుతూనే ఉంటాం. వాటి నుంచే వచ్చే మురికి, జిడ్డు సింక్ లో పేరుకుపోతుంటాయి. కాబట్టి ప్రతిరోజు పాత్రలు శుభ్రం చేశాక.. సింక్ లో వేడి నీటిని పోయడం మంచిది. దీనివల్ల బ్యాక్టీరియా పెరగదు. సింక్ నీట్ గా ఉంటుంది. వాసన కూడా రాదు.
నిమ్మరసం లేదా నిమ్మ తొక్కలు
నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. వాడిన నిమ్మ తొక్కలను సింక్ డ్రెయిన్‌లో వేసి వేడి నీటితో రుద్దితే మంచి ఫలితం కనిపిస్తుంది. లేదా నిమ్మరసం వేసి కొంతసేపు అలాగే వదిలేసినా సరిపోతుంది.
చిటికెడు ఉప్పును డ్రెయిన్‌లో వేసి తర్వాత వేడి నీరు పోస్తే మురికి తొలగిపోతుంది. వేడినీటిలో కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి... ఆ తర్వాత డ్రైన్‌లో పోయాలి. కొంత సేపు అలాగే ఉంచి నీళ్లతో శుభ్రం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
సింక్ ట్రాప్
సింక్ కింద ఉన్న పైపులో నీరు నిల్వ ఉంటుంది. ఇది కూడా దుర్వాసనకు కారణం కావచ్చు. కాబట్టి వారానికి ఒకసారి దాన్ని తీసి శుభ్రం చేయాలి. వాడిన కాఫీ పొడిని డ్రెయిన్ లో వేసి.. కొన్ని వేడి నీళ్లు పోసినా దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు.
55
ఆహార వ్యర్థాలను ముందే తొలగించండి
ఆహార వ్యర్థాలను ప్లేటులో ఉంచి.. అలాగే సింక్‌లో వేయడం ద్వారా కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి ప్లేటు కడిగే ముందే ఆ మిగిలిన ఫుడ్ ని డస్ట్ బిన్ లో వేయండి. ప్రతిరోజు రాత్రి సింక్ ని శుభ్రం చేసి ఖాళీగా వదిలేయండి.