Tour Guide : వరుసగా మూడ్రోజుల సెలవులు... కేవలం 3 వేలకే 1 నైట్, 2 డేస్ టూర్, ప్లాన్ రెడీ

Published : Jan 23, 2026, 12:37 PM ISTUpdated : Jan 23, 2026, 12:54 PM IST

ఈ వారాంతం వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ హాలిడేస్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టిసి అద్భుతమైన టూర్ ప్లాన్ రెడీ చేసింది. ఇంకెందుకు ఆలస్యం... వెంటనే బ్యాగ్ సర్దుకుని పుణ్యక్షేత్రాల బాట పట్టండి.

PREV
15
టూర్ ప్లాన్ చేసుకొండి..

Holidays : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వరుస సెలవులు వస్తున్నాయి... విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా సెలవులు వర్తిస్తాయి. సంక్రాంతి సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లి తెగ ఎంజాయ్ చేసిన తెలుగువారు ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజా లాంగ్ వీకెండ్ వారికి కాస్త ఊరట ఇవ్వనుంది. సంక్రాంతి సెలవులు ముగిసి తిరిగి ఉసూరుమంటూ ఆఫీసులకు వెళుతున్న పెద్దలు, స్కూళ్లకు వెళుతున్న పిల్లలు, రెగ్యులర్ వంటింటి పనుల్లో మునిగిన గృహిణులు ఈ సెలవుల్లో హాయిగా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

25
స్కూళ్లకి మూడ్రోజులు సెలవులే..

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గత వారమంతా విద్యాసంస్థలకు సెలవులే... ఈ సోమవారమే (జనవరి 19న) తిరిగి స్కూళ్ళు ప్రారంభం అయ్యాయి. ఐదురోజులు గడిచాయో లేవో మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి సిటీస్ లో ఐటీ, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ లో రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవులే. కాబట్టి ఈ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే విద్యాసంస్థలకు కూడా ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. ఇలా కొందరు విద్యార్థులకు రేపు (జనవరి 24న) సెలవే.

ఇక ఆదివారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ సాధారణ సెలవు. సోమవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో సెలవు కలిసివస్తోంది. ఇలా మరోసారి తెలుగు విద్యార్థులకు వరుసగా మూడురోజులు వస్తున్నాయి.

35
ఉద్యోగులకూ మూడ్రోజులు సెలవులే..

విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ మూడ్రోజులు సెలవులే. ఐటీ, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు శనివారమే సెలవులు ప్రారంభంకాగా... మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు రెండ్రోజులు (ఆది, సోమవారం) సెలవులుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు హాజరుకావాల్సి ఉంటుంది... తర్వాత పనేమీ ఉండదు... ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇలా తెలుగు విద్యార్థులు, ఉద్యోగాలు చేసే వారి పేరెంట్స్ కు వరుస సెలవులు కలిసి వస్తున్నాయి. కాబట్టి మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

45
తెలంగాణ ఆర్టిసి టూర్ ప్లాన్

వరుస సెలవుల నేపథ్యంలో తెలంగాణ ఆర్టిసి ప్రత్యేక టూర్ ప్లాన్ ను ప్రకటించింది. బడ్జెట్ లోనే లగ్జరీ బస్సులో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టివచ్చే అవకాశం కల్పిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పుణ్యకేత్రాలకు టూర్ ప్లాన్ ప్రకటించింది తెలంగాణ ఆర్టిసి.

కేవలం రూ.3 వేలకే ఒకరు ఓ నైట్, టూ డేస్ పర్యటించే ప్లాన్ ఇది. ఇందులో ప్రముఖ పుణ్యక్షేత్రాలు పండరీపూర్, గానుగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ ఆలయాలను చుట్టిరావచ్చు. అయితే ఈ టూర్ కు వెళ్లాలని అనుకునేవారు వెంటనే టికెట్ బుక్ చేసుకోవాల్సిన ఉంటుంది.. ఎందుకంటే జనవరి 23 అంటే ఇవాళ సాయంత్రమే బస్సు బయలుదేరుతుంది. బిహెచ్ఈఎల్ డిపో నుండి బస్సు ప్రారంభం అవుతుంది.

ఈ టూర్ కి సబంధించి మరిన్ని వివరాల కోసం ఆర్టిసి అధికారులను సంప్రదించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా 9391072283 లేదా 9063401072 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. కుటుంబంతో వెళ్లాలనుకున్నా లేదంటే ఒంటరిగా పుణ్యక్షేత్రాలను చుట్టిరావాలని అనుకుంటున్నా ఆర్టిసి అందించే ఈ టూర్ ప్లాన్ ఉత్తమం.

55
ఫిబ్రవరిలో గోవా టూర్...

ప్రకృతి అందాలను ఇష్టపడేవారికోసం గోవా ట్రిప్ ను ప్లాన్ చేసింది తెలంగాణ ఆర్టిసి. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 6 నుండి గోవా టూర్ ను సిద్దంచేసింది... కేవలం రూ.3,500 కే 3 నైట్స్, 4 డేస్ గోవా టూర్ ప్యాకేజీని అందిస్తోంది. గోవాతో పాటు హంపి, తుల్జాపూర్ కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories