Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం

Published : Jan 22, 2026, 05:35 PM IST

AI Data Center in Hyderabad : హైదరాబాద్ లో మరో టెక్నాలజీ విప్లవం రానుందా..? ఇప్పటికే నగరంలో ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతుండగా దీనికి బూస్ట్ ఇచ్చేందుకు ఏఐ డేటా సెంటర్ వస్తోంది.  

PREV
15
తెలంగాణలోనూ ఏఐ డేటా సెంటర్

AI Data Center : తెలుగు రాష్ట్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి కేరాఫ్ అడ్రస్ గా మారేలా ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో గ్లోబల్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకువచ్చింది. ఏకంగా లక్ష కోట్లకుపైగా పెట్టుబడితో లక్షలాదిమందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... వడివడిగా పనులు కూడా సాగుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో మరో డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు నెదర్లాండ్ కు చెందిన ఓ కంపెనీ ముందుకువచ్చింది.

25
డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం..

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్ పట్టణంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులు దేశవిదేశాలకు చెందిన పాలకులు, వ్యాపారసంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ క్రమంలో వ్యాపారులను ఆకర్షించి తమ దేశానికి పెట్టుబడులు రాబట్టుకోవడమే పాలకుల పని. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా దావోస్ వెళ్లారు. వారి టీమ్స్ వ్యాపారులను కలిసి తమ రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఐఏ డేటా సెంటర్ ఏర్పాటుకు నెదర్లాండ్ కు చెందిన యూపిసి వోల్ట్ సంస్థ ముందుకు వచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దావోస్​లో యూపీసీ వోల్ట్ ప్రతినిధులతో భేటీ అయ్యింది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో ముఖ్యమంత్రి టీం ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో డేటా సెంటర్ ఏర్పాటుకు యూపిసి వోల్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

35
ఏఐ డేటా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు..?

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివారులో మరో హైటెక్ సిటీని నిర్మించేందుకు సిద్దమయ్యింది... దీనికి 'భారత్ ఫ్యూచర్ సిటీ' గా నామకరణం చేసింది. ఇక్కడే ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు నెదర్లాండ్ సంస్థ ముందుకు వచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుచేయడానికి యూపీసీ వోల్ట్‌ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రాబోయే ఐదేళ్లలో రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది యూపిసీ వోల్ట్ సంస్థ.

45
యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు

ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ పనులు ప్రారంభంనుండే యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరా కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్​ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్​ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి.

55
డేటా సెంటర్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్...

భారత ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పాత్రను మరింత పెంచేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అందులో భాగంగానే ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యావరణానికి హాని చేయకుండా అభివృద్ధిని సాధించి దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories