Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు.. ఎలా ఉండనున్నాయో తెలుసా..?

Published : Jan 17, 2026, 09:20 AM IST

Vegetables Price : సంక్రాంతి సెలవులు ముగియడంతో తెలుగు ప్రజలు సాధారణ జీవితంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయలు కొనుగోలు చేసి సోమవారం నుండి యధావిధిగా పనులకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. మరి వెజిటెబుల్స్ ధరలు ఎలా ఉన్నాయంటే… 

PREV
15
ఆదివారం మార్కెట్ లో కూరగాయల ధరలు

Vegetables Price : సంక్రాంతి పండగ ముగిసింది.. ఇక తెలుగు ప్రజలు సంబరాల నుండి సాధారణ జీవితంలోకి చేంజ్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో సెలవులు ముగిసి ఇవాళ్టి (జనవరి 17, శనివారం) నుండి స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో సోమవారం (జనవరి 19న) పున:ప్రారంభం అవుతాయి. ఉద్యోగులు కూడా సంక్రాంతి సెలవులు ముగించుకుని సోమవారం నుండి రెగ్యులర్ గా ఆఫీసులకు వెళ్ళేందుకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, ఉద్యోగులు ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయలు కొనేందుకు  రెడీ అవుతున్నారు. మరి ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

25
టమాటా ధర ఎంతుంది?

సంక్రాంతి పండగకు ముందు టమాటా ధరలు అమాంతం పెరిగి తెలుగు ప్రజలను కంగారు పెట్టాయి. ఓ దశలో కిలో రూ.60-70 కూడా పలికింది... దీంతో టమాటా సెంచరీ కొడుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా టమాటా ధరలు దిగివచ్చింది... మళ్లీ కిలో రూ.20 కి చేరింది. ప్రస్తుతం మార్కెట్ లో ఇదే ధర కొనసాగుతోంది.

35
ఉల్లిపాయల ధర ఎంతుంది?

ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చాలారోజులుగా కిలో ఉల్లి ధర రూ.20 కి అటుఇటుగా ఉంటోంది... ఇదే ధర కొనసాగుతోంది. కిలో అయితే రూ.20 ఉండగా రూ.100 కి ఐదారు కిలోలు లభిస్తోంది. మంచి నాణ్యత కలిగిన పాత ఉల్లిపాయలు కిలో రూ.30 కి లభిస్తున్నాయి.

45
ఇతర కూరగాయల ధరలు

చిక్కుడు కిలో రూ 20-25

పచ్చిమిర్చి కిలో రూ.40-45

బీట్ రూట్ కిలో రూ.15-20

ఆలుగడ్డ కిలో రూ.20

క్యాప్సికం కిలో రూ.35-40

కాకరకాయ కిలో రూ.40

సొరకాయ కిలో రూ.20-30

బీన్స్ కిలో రూ.45-50

క్యాబేజీ కిలో రూ.20

క్యారెట్ కిలో రూ.20-30

వంకాయలు కిలో రూ.20-30

బెండకాయలు కిలో రూ.35-40

బీరకాయ కిలో రూ. 40-50

దొండకాయ కిలో రూ.40-50

55
ఆకుకూరల ధరలు

పాలకూర కిలో రూ.30-40 (కొంచెం పెద్దసైజు కట్ట ఒక్కటి రూ.20)

పూదీనా రూ.10-15 కట్ట

కరివేపాకు రూ.10 కట్ట (కిలో రూ.120)

కొత్తిమీర రూ.20 కట్ట, చిన్న కట్ట రూ.10

మెంతి కూర కిలో రూ.20

చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.

గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

Read more Photos on
click me!

Recommended Stories