School Holidays : సంక్రాంతి సెలవులు ఇంకో రెండ్రోజులు పొడిగించాలనే డిమాండ్ పేరెంట్స్, టీచర్స్ నుండి వినిపిస్తోంది. మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సెలవులు ఇస్తుందా…?
Sankranti Holidays : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి... వారం రోజుల నుండి సందడి మొదలైనా ఈ మూడ్రోజులుగా (భోగి, సంక్రాంతి, కనుమ) సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే తెలంగాణలో ఇవాళ్టి (జనవరి 16) తో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి... ఇది విద్యార్థులు, వారి పేరెంట్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ విద్యాసంస్థలకు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగా జనవరి 18 వరకు సెలవులు పొడిగించాలని... జనవరి 19 సోమవారం రీఓపెన్ చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
25
సంక్రాంతి సెలవులు పొడిగిస్తారా..?
సంక్రాంతి పండగను తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఉపాధి... ఇలా వివిధ కారణాలతో ఎక్కడెక్కడో స్థిరపడినవారు కూడా ఈ పండక్కి సొంతూళ్లకు వెళతారు. ఇలా హైదరాబాద్ నుండి కూడా చాలామంది ఏపీకి తరలివెళ్లారు... వీళ్లంతా ఇంకా పండగ సెలబ్రేషన్స్ లో ఉండగానే తెలంగాణలో సెలవులు ముగుస్తున్నాయి... స్కూళ్లు రీఓపెన్ చేసేందుకు యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి.
అయితే సాధారణంగా కనుమ రోజు ప్రయాణాలు చేయవద్దని అంటుంటారు... కానీ పిల్లల స్కూల్ మిస్ కాకుండా ఉండాలంటే పేరెంట్స్ ఇవాళే (జనవరి 16) హైదరాబాద్ కు బయలుదేరాల్సి ఉంటుంది... అంటే కనుమ రోజు ప్రయాణం చేయాల్సిఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సంక్రాంతి సెలవుల విషయంలో మరోసారి పునరాలోచించి మరో రెండ్రోజులు పొడిగించాలని... జనవరి 17, 18 (శని, ఆదివారం) కూడా సెలవులుగా ప్రకటించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
35
తెలంగాణ పేరెంట్స్ డిమాండ్ కూడా ఇదే...
కేవలం హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రదేశ్ వాళ్లే కాదు తెలంగాణ విద్యార్థుల పేరెంట్స్ కూడా సంక్రాంతి సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. కేవలం ఒక్కరోజు (జనవరి 17) కోసం సొంతూళ్లను వదిలి పండగపూట పట్టణాలను ప్రయాణంకావాల్సి ఉంటుంది... ఈరోజు సెలవు ఇస్తే ఆదివారం సెలవు కూడా కలిసివస్తుందని అంటున్నారు. ఇలాగైతే కనుమను కూడా ప్రశాంతంగా జరుపుకుని... శనివారం విశ్రాంతి తీసుకుని... ఆదివారం పట్టణాలకు బయలుదేరతాం... సోమవారం (జనవరి 19) నుండి ప్రెష్ గా పిల్లలను స్కూళ్లకు పంపుతామని పేరెంట్స్ అంటున్నారు.
ఇలా ఇరురాష్ట్రాల పేరెంట్స్ నుండి సంక్రాంతి సెలవుల పొడిగింపు డిమాండ్ వినిపిస్తుండటంతో రేవంత్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఒక్కటి మాత్రం నిజం... సెలవు ఉన్నా లేకున్నా శనివారం స్కూళ్లకు విద్యార్థులు రావడం కష్టం.... కాబట్టి ఆరోజు సెలవు పొడిగించడమే మేలని టీచర్లు కూడా కోరుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఇప్పటికే జనవరి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి..
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుండి 18 వరకు ఉన్నాయి. అంటే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ స్కూల్స్ అన్నీ జనవరి 19న రీఓపెన్ అవుతాయి... కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లం లేదు.
తెలంగాణలోనే జనవరి 10 నుండే సంక్రాంతి సెలవులు ప్రారంభమైనా జనవరి 16 అంటే ఇవాళ్టితో ముగుస్తున్నాయి. రేపు (శనివారం) ఒక్కరోజే స్కూళ్లు నడుస్తాయి... తిరిగి ఆదివారం మళ్లీ సెలవు ఉంటుంది. అందుకే ఏపీలో మాదిరిగా జనవరి 18 వరకు అంటే మరో రెండ్రోజులు సెలవులు పొడిగించాలనే డిమాండ్ పేరెంట్స్ నుండి వినిపిస్తోంది.
55
వచ్చేవారం మరో లాంగ్ వీకెండ్...
ఇలా సంక్రాంతి సెలవులు ముగుస్తాయో లేదో అలా మరో లాంగ్ వీకెండ్ రెడీగా ఉంటోంది. జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం వస్తోంది... అంటే దీనికి సండే సెలవు కలిసివస్తుంది. విద్యార్థులకు రెండ్రోజులే సెలవులు వస్తున్నాయి. అయితే ఐటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులకు శనివారం వీకెండ్ సెలవు కూడా కలిసివస్తుంది… కాబట్టి వారికి శని, ఆది, సోమ (జనవరి 24,25,26) మూడ్రోజులు సెలవు ఉంటుంది.