IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్ లో అయితే గజగజలాడించే చలిగాలులు వీస్తున్నాయి. ఇక పొగమంచు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
IMD Rain Alert : భారతదేశాన్ని చలి గజగజా వణికిస్తోంది. సాధారణంగానే నిత్యం మంచుతో కప్పబడి చలి అధికంగా ఉండే హిమాలయా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ విపరీతమైన మంచు కురుస్తోంది... కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీస్ కు చేరుకున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ లో దట్టమైన మంచుతో పాటు చలిగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. హిమాలయ పర్వతాలు వ్యాపించివున్న రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో మంచు తుపానులు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
25
డిసెంబర్ లోనే చలి పీక్స్
ఇక ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చలితీవ్రత పెరిగింది. దేశ రాజధాని న్యూడిల్లిలో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... చలితో పాటు విపరీతమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డిసెంబర్ చివర్లోనే ఈస్థాయిలో టెంపరేచర్స్ పడిపోతుంటే ఇక జనవరిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు. ఉదయం, రాత్రుళ్ళు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
35
ఉత్తరాదినుండి చలిగాలులు
ప్రస్తుతం ఉత్తరాది నుండి దక్షిణాదివైపు చల్లని గాలులు వీస్తున్నాయి... దీంతో ఇక్కడ కూడా చలి పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయి... చలిగాలులు చంపేస్తున్నాయి. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏ మారుమూల అటవీప్రాంతంలో కాకుండా రాజధాని నగరం హైదరాబాద్ (GHMC పరిధిలో) నమోదవడం ఆశ్చర్యకరమైన అంశం.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం... పటాన్ చెరు ఈక్రిశాట్ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యల్ప టెంపరేచర్స్ 6.4 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక రాజేంద్రనగర్ లో 10.5 డిగ్రీస్ నమోదయ్యాయి. ఇలా శివారు ప్రాంతాల్లోనే కాదు నగరంలో కూడా లోయెస్ట్ టెంపరేచర్స్ ఉంటూ చలి ఇరగదీస్తోంది... దీంతో తెల్లవారుజామున వాకింగ్, జాగింగ్ కు వెళ్ళేవారు ఇబ్బందిపడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు.
55
ఈ తెలంగాణ జిల్లాల్లో అత్యల్ఫ ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో 8.2, మెదక్ లొ 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండలో 11.5, రామగుండంలో 12.2, నిజామాబాద్ లో 12.5, నల్గొండలొ 13 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. ప్రాంతాలవారిగా చూసుకుంటే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 7, సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 7.5, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 8.3, వికారాబాద్ జిల్లా నవాబ్ పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.