ఇక మరో తెలుగురాష్ట్రం తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు (శుక్ర, శనివారం) ఎండల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని... ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఇక ఆదివారం(మార్చి 15న) ఆకాశం మేఘావృతమై ఉండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.