ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజయ్ జాజు, ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "హైదరాబాద్ నెట్‌ఫ్లిక్స్‌కు ఒక సహజమైన ఇల్లు లాంటిది. నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ కొత్త అవకాశాలను, కెరీర్లను సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించాయి. ప్రతిభకు, కథలకు హైదరాబాద్ గ్లోబల్ గేట్‌వేగా నిలుస్తుంది," అని పేర్కొన్నారు. ఐటి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను స్టోరీ టెల్లింగ్ కు రాజధానిగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ స్టూడియో రాక మరింత బలాన్నిస్తుందని అన్నారు.