వివిధ శాటిలైట్ డేటాని గమనిస్తే, ఏపీ, తెలంగాణ ఆకాశంలో రోజంతా మేఘాలు పరుగులు తీస్తూ కనిపిస్తాయి.
తెలంగాణ వాతావరణం: ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్య, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్‌లలో పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. తేమ ఉత్తర తెలంగాణలో 75%, మిగతా భాగాల్లో 52% వరకు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల జల్లులు పడవచ్చు. మిగతా కోస్తాంధ్ర, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. తేమ ఉత్తరాంధ్రలో 64%, మిగతా ఏపీలో 41%గా నమోదుకానుంది. రెండు రాష్ట్రాల్లోనూ గంటకు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.