రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Aug 15, 2026, 09:21 PM IST

Revanth Reddy: సంగారెడ్డిలో కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సభలో కాంగ్రెస్‌ నేత, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిపై ప్రశంసలు కురిపించారు.

PREV
15
జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడం అరుదు

జగ్గారెడ్డి వంటి నాయకుడిని డబ్బుతో కొనలేమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా అలాంటి నేత దొరకరని అన్నారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిగా జగ్గారెడ్డిని అభివర్ణించారు. నాయకులకు మార్కులు వేయాల్సి వస్తే తనకంటే జగ్గారెడ్డికే ఎక్కువ మార్కులు వస్తాయని సీఎం అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. జగ్గారెడ్డి ప్రజాజీవితంలో కొనసాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

25
రాహుల్‌ గాంధీ రాముడైతే.. జగ్గారెడ్డి హనుమంతుడు

సభలో జగ్గారెడ్డి గురించి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని రాముడితో పోల్చిన సీఎం.. జగ్గారెడ్డి హనుమంతుడిలాంటి నాయకుడని అన్నారు. రాహుల్‌ గాంధీ తీసుకునే నిర్ణయాలను జగ్గారెడ్డి గౌరవిస్తారని, పార్టీ నాయకత్వం సూచించిన మార్గంలోనే ఆయన ముందుకు సాగుతారని చెప్పారు. జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాన్ని రాహుల్‌ గాంధీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. జగ్గారెడ్డికి రాజకీయ భవిష్యత్తు విషయంలో పార్టీ అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులతో పాటు సంగారెడ్డి ప్రజలపై ఉందని అన్నారు.

35
30 ఏళ్ల స్నేహం.. జగ్గారెడ్డిపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

జగ్గారెడ్డితో తనకు సుమారు 30 ఏళ్లుగా స్నేహ సంబంధం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. జగ్గారెడ్డి రాజకీయంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై తుది నిర్ణయం కాంగ్రెస్‌ అధిష్ఠానానిదేనని చెప్పారు. జగ్గారెడ్డి ఇకపై రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేయకూడదన్నట్టుగా సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా జీవితాన్ని కొనసాగించాలని కోరారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా జగ్గారెడ్డి గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

45
బీఆర్‌ఎస్‌, బీజేపీలపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

సంక్షేమ పథకాల అమలుపై బీఆర్‌ఎస్‌, బీజేపీలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు వైపుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గతంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ పేదలకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతు సంక్షేమం విషయంలోనూ గత ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. రైతుభరోసా కింద 32 నెలల్లో రూ.36 వేల కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రైతాంగం తక్కువ అప్పుల భారంతో ఉందంటూ కేంద్ర ప్రభుత్వ రిపోర్టులో పేర్కొన్న విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్‌ కోతలు పెరుగుతాయని గతంలో బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసిందని సీఎం గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్‌ సరఫరాలో పెద్దగా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.

55
స్మార్ట్‌ రేషన్‌ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక

కొత్తగా అందిస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ప్రాధాన్యాన్ని కూడా రేవంత్‌రెడ్డి వివరించారు. ఇది కేవలం ఒక గుర్తింపు కార్డు కాదని, పేద కుటుంబాలకు భరోసా కల్పించే సాధనమని అన్నారు. ఆకలి తీర్చే సంక్షేమ వ్యవస్థకు ఈ కార్డు కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దేశంలో రేషన్‌ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి ఉందని సీఎం అన్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన ఈ కార్యక్రమంలో రేషన్‌ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ విధానాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్‌ నాయకత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా జగ్గారెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Read more Photos on
click me!

Recommended Stories