School Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు కాదు మూడ్రోజుల సెలవులు.. ఈ సోమవారం కూడా హాలిడేనే, ఎందుకో తెలుసా?

Published : Aug 15, 2026, 01:18 PM IST

ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సెలవు… ఆగస్ట్ 16న ఆదివారం కాబట్టి సెలవు… మరి ఆగస్ట్ 17న సోమవారం ఎందుకు సెలవు ఉంది? ఈ వీకెండ్ రెండ్రోజులు కాదు మూడ్రోజులు సెలవులు ఎందుకు వస్తున్నాయి?

PREV
14
ఈ మూడ్రోజులు సెలవులే..

School Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవుల పరంపర కొనసాగుతోంది. గత వీకెండ్ లో రెండో శనివారం, ఆదివారం, బోనాల పండగ సందర్భంగా సోమవారం సెలవులు వచ్చాయి... అంటే వరుసగా మూడ్రోజులు హాలిడేస్ కలిసివచ్చాయి. ఈ లాంగ్ వీకెండ్ లో చేసిన ఎంజాయ్ ని మర్చిపోకముందే తెలుగు విద్యార్థులకు మరో లాంగ్ వీకెండ్ వచ్చేసింది... ఈ వీకెండ్ లోనూ వరుసగా మూడ్రోజులు సెలవులున్నాయి.

ఈ శని, ఆదివారం (ఆగస్ట్ 15, 16) సెలవుల గురించి అందరికీ తెలుసు. మరి సోమవారం (ఆగస్ట్ 17న) ఎందుకు సెలవుంది? అనేదే చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ డౌట్. మరి ఈ సెలవు ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

24
ఆగస్ట్ 15,16, 17 మూడ్రోజులు సెలవే

ఆగస్ట్ 15 సెలవు : భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ (శనివారం) దేశవ్యాప్తంగా సెలవే. జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు ఇతర దేశభక్తి కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి... అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోతారు కాబట్టి సెలవు కిందే లెక్క. ఇలా జాతీయ పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చదువకునే విద్యార్థులకు కూడా ప్రత్యేక సెలవు వచ్చింది.

ఆగస్ట్ 16 సెలవు : సాధారణంగా ప్రతి ఆదివారం విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఇలా ఈ ఆగస్ట్ 16న ఆదివారమే కాబట్టి సెలవుంది. ఆసక్తికరంగా రెండు సెలవుల మధ్యలో ఆదివారం రావడంతో వరుసగా మూడ్రోజుల హాలిడేస్ వస్తున్నాయి.

ఆగస్ట్ 17 సెలవు : ఈ వీకెండ్ కేవలం రెండ్రోజుల సెలవులే వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు... కానీ మూడోరోజు కూడా సెలవే. ఆగస్ట్ 17న అంటే ఈ సోమవారం తెలుగు ప్రజల ఎంతో పవిత్రమైన రోజు... ఈరోజు నాగుల పంచమి పండగ ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంది.

34
ఆగస్ట్ 17 అధికారిక సెలవేనా?

ఈ సోమవారం నాగుల పంచమి (నాగ పంచమి) సెలవు అందరికీ వర్తించదు... ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించలేదు. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు యదావిధిగా నడుస్తాయి. అయితే ఈ పండగను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం తమ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సెలవు ప్రకటిస్తున్నాయి. అంటే ఈ సెలవు కొన్ని ప్రాంతాల్లోని కొందరు విద్యార్థులకే అన్నమాట.

నాగుల పంచమి వేడుకలను మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్స్ లోని తెలంగాణ జిల్లాల్లో ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవులు ప్రకటిస్తున్నాయి. జహిరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఇప్పటికే తల్లిదండ్రుల మొబైల్స్ కి విద్యాసంస్థల నుండి సెలవు ప్రకటన మెసేజ్ లు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొన్ని బార్డర్ జిల్లాల విద్యార్థులకు నాగుల పంచమి సెలవు ఉండే అవకాశాలు ఉన్నాయి.

44
నాగుల పంచమికి పాములకు పూజలు

పరమశివుడి మెడలో ఆభరణం, విష్ణుమూర్తి పాన్పుగా ఉండే పాములకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రాణాలు తీసే విషసర్పాలను కూడా దేవతలుగా భావించి పూజిస్తుంటారు. ఇలా పాములను పూజించే ప్రత్యేకమైన పండగే ఈ నాగుల పంచమి.

నాగుల పంచమి పండగను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. ఇక పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నాగుల పంచమి వేడుకలు జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వేరువేరు పేర్లతో పాములను పూజించే పండగను జరుపుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో అయితే నాగుల పంచమి రోజు మహిళలు సాంప్రదాయబద్దంగా రెడీ అయి పూజలు చేస్తారు. పాలు, నైవేధ్యంతో దేవాలయాలు లేదా గ్రామ సమీపంలోని పుట్టల వద్దకు వెళతారు... అందులోని పాములకు భక్తితో పాలు పోస్తారు. నైవేద్యం సమర్పించి, కొబ్బరికాయ కొట్టి భక్తితో దండం పెట్టుకుంటారు. నాగదేవత అనుగ్రహం కోసం మహిళలు నాగుల పంచమికి పాములను పూజిస్తుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories