ఆహారంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన కాక్‌టెయిల్ మెనూ కూడా వాయు ప్రత్యేకతగా నిలుస్తోంది. 'ది పేపర్ ప్లేన్ లాగ్‌బుక్' పేరుతో రూపొందించిన ఈ కాక్‌టెయిల్ కాన్సెప్ట్‌లో భారతదేశంలోని వివిధ ప్రాంతాల రుచులను ప్రతిబింబించే పదార్థాలను ఉపయోగిస్తున్నారు. క్రిమ్సన్ విండ్, కోకమ్ క్లౌడ్, ఫైర్‌స్టార్మ్ ఎంబర్ వంటి ప్రత్యేక కాక్‌టెయిల్స్‌లో గోంగూర, కోకమ్, ప్యాషన్ ఫ్రూట్, అల్లం, ఫెర్మెంటెడ్ మిరపకాయ వంటి ప్రాంతీయ పదార్థాలను వినియోగించి వినూత్న రుచులను అందిస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్, కోర్ట్‌యార్డ్ బై మారియట్ హైదరాబాద్ మల్టీ ప్రాపర్టీ జనరల్ మేనేజర్ అమర్‌దీప్ సింగ్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగర ఉత్సాహాన్ని ప్రతిబింబించే సామాజిక ప్లాట్ ఫామ్ గా 'వాయు'ను రూపొందించామని తెలిపారు. భారతీయ ప్రాంతీయ రుచులు, వినూత్న కాక్‌టెయిల్స్, ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులకు మరపురాని అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.