Weather Update: రాబోయే 3 రోజులు వానలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక

Published : Aug 02, 2026, 09:26 AM IST

Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాగల మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే, ఏపీలోని పలు ప్రాంతాలకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.

PREV
15
ఈ వారం వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) మరో ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. దీని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉండదని అధికారులు వెల్లడించారు. అయితే నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉనట్లు స్పష్టం చేశారు.

25
తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ వంటి 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ఉరుములు వచ్చేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని ఐఎండీ సూచించింది.

35
ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాల ప్రభావం కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

45
ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి నది ప్రవాహం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 56 అడుగులకు చేరడంతో వరద తీవ్రత విపరీతంగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.

55
అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులు.. దేశవ్యాప్త వర్షాల ప్రభావం

గ్లోబల్ వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన డాల్ఫిన్ అనే టైపూన్ గంటకు 230 కిమీ వేగంతో చైనా వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏమీ ఉండదు. మరోవైపు, దేశంలోని ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ, జమ్మూ కశ్మీర్‌లలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాల వల్ల 13 మంది మరణించగా, కేరళలో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవించాయి. కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ వల్ల ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో వీస్తున్న గాలుల వల్ల ఆగస్టు నెలలో అప్పుడప్పుడు పడే జల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుందని ఐఎండీ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories