రైలు నంబర్ 07189 మహారాష్ట్రలోని నాందేడ్ లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతుంది. తెలంగాణలోకి బాసరలోనే ఎంట్రీ ఇస్తుంది... సాయత్రం 6 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. రెండు నిమిషాలపాటు మాత్రమే బాసర స్టేషన్లో ఆగుతుంది... అక్కడినుండి నిజామాబాద్ కు 25 నిమిషాల్లో అంటే సాయంత్రం 6.25 గంటలకు చేరుకుంటుంది. కామారెడ్డి, మేడ్చల్ మీదుగా హైదరాబాద్ శివారులోని చర్లపల్లి స్టేషన్ కు రాత్రి రాత్రి 8.30 గంటలకు చేరుకుంటుంది.
చర్లపల్లిలో 15 నిమిషాలు ఆగి హైదరాబాద్ ప్రయాణికులను ఎక్కించుకుని నల్గొండ, మిర్యాలగూడ మీదుగా ఏపీలోకి ఎంటర్ అవుతుంది. ఆ రాష్ట్రంలోని నడికుడి, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచర్ల, వినుగొండ, దొనకొండ, మార్కాపూర్, కుంభం, నంద్యాల, జమ్మలమడుగు, యెర్రగుంట్ల, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఇలా శుక్రవారం సాయంత్రం నాందేడ్ లో బయలుదేరే రైలు శనివారం 12 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.