ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం రోజున విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.
ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని నగరి, అగ్రం, పిచ్చాటూరు, విజయపురం, కన్నవరం, సత్యవేడు, పుత్తూరు, నిండ్ర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాబోయే కొన్ని గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. రాయలసీమలో మాత్రం వర్షపాతం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ బలమైన ఈదురుగాలులు వీస్తాయి.