IMD Cold Wave Alert : ఇక చలిగాలులకు బ్రేక్ ... ఈ వారంరోజులు రిలాక్స్.. తర్వాత మళ్ళీ గజగజే..!

Published : Dec 31, 2025, 07:38 AM IST

Weather Report :  రాబోయే రోజుల్లో తెలంగాణలో చలి కాస్త తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జనవరి 2026 ఆరంభంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో తెలుసా?

PREV
16
ఈ వారంరోజులు రిలాక్స్

Weather Updates : డిసెంబర్ వస్తూనే చలిగాలులను మోసుకువచ్చింది... ఈ నెల ఆరంభంనుండి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పతనం ప్రారంభమయ్యింది. అయితే గత 25 రోజులుగా చలికి వణికిపోతున్న ప్రజలు ఈ వారంరోజులు కాస్త రిలాక్స్ కావచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జనవరి 2026 ఫస్ట్ వీక్ చలితీవ్రత తక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నారు.

26
జనవరి 2026 లో వెదర్ చేంజ్

జనవరి 1 నుండి 6 వరకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణ శీతాకాలంలో మాదిరిగానే నమోదవుతాయని... పూర్తిగా కుప్పకూలిపోయే అవకాశాలు లేవని వెదర్ మ్యాన్ తెలిపారు. కొన్నిప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 10 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ప్రకటించింది. మొత్తంగా ఈ డిసెంబర్ స్థాయిలో జనవరి మొదటివారంలో చలి ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది.

36
మళ్లీ చలిపులి

జనవరి 8 నుండి తిరిగి వాతావరణ పరిస్థితులు మారతాయని... మెళ్లిగా చలి పెరుగుతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. సంక్రాంతి నాటికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరి గజగజలాడించే చలి ఉంటుందని తెలిపారు. ఇలా ఉష్ణోగ్రతలు పెరిగినట్లే పెరిగి మళ్ళీ తగ్గుతాయని... చలి తగ్గినట్లే తగ్గి పెరుగుతుందని వాతావరణ నిపుణులు, వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

46
ఇవాళ ఒక్కరోజే గజగజలాడించే చలి...

ఇవాళ(డిసెంబర్ 31 రాత్రి నుండి జనవరి 1 ఉదయం వరకు) అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో 5-10 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటాయట... అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

56
తెలంగాణలో లోయెస్ట్ టెంపరేచర్ ఎక్కడంటే...

తెలంగాణలో మంగళవారం (డిసెంబర్ 30) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 6.7 టెంపరేచర్స్ నమోదయ్యాయి. మెదక్ లో కూడా 8 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక హన్మకొండలో 10, రామగుండంలో 10.8, నిజామాబాద్ లో 13, ఖమ్మంలో 14.4, మహబూబ్ నగర్ లో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

66
హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ విషయానికి వస్తే జిహెచ్ఎంసి పరిధిలోని శివారుప్రాంతం పటాన్ చెరులో అత్యల్పంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాజేంద్ర నగర్ లో 9.5, హయత్ నగర్ లో 12.6, బేగంపేటలో 13.1, హకీంపేటలో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, లింగంపల్లి, మౌలాలి, ఉప్పల్, నాగోల్, ఎల్బి నగర్ ఆల్వాల్, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories