Rain Alert: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అల‌ర్ట్.. వ‌చ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షాలు

Published : Jun 11, 2025, 07:48 PM IST

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను వాత‌వార‌ణ శాఖ అల‌ర్ట్ చేసింది. రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఇంత‌కీ ఏయే ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
బుధ‌వారం నుంచి భారీ వ‌ర్షాలు

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

25
ఉరుములతో కూడిన వానలు..

వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది వ్యవసాయ పనులకు అంతరాయం కలిగించవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.

35
ఆరెంజ్ అల‌ర్ట్

రాష్ట్రవ్యాప్తంగా ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ చేశారు. ఈ జాబితాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.

45
తేలిక‌పాటి నుంచి భారీ వ‌ర్షాలు.

గురువారం ఆసిఫాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

55
శ‌ని, ఆదివారాల్లో కూడా

శని, ఆదివారాల్లో కూడా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు.

భారీ వర్షాలు కురిసే సమయంలో రైతులు పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది. ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదని స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories