తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులకు బంపర్ ఆఫర్ లభించింది. వరుసగా సెలవులు వచ్చాయి. జూలై 21న బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
బోనాలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించింది. అందుకే ప్రతి ఏడాది బోనాలకు సెలవులు ఇస్తోంది. ఈసారి కూడా బోనాల సందర్భంగా జూలై 21 సోమవారం సెలవుగా ప్రకటించారు.
25
జూలై 23న విద్యాసంస్థల బంద్
జూలై 23న కూడా స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. పలు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యా రంగంలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల లేమి, ప్రైవేట్ విద్యాసంస్థల్లో భారీ ఫీజుల.. ఇలా పలు అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.
బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరాయి. దీంతో జూలై 23న కూడా విద్యాసంస్థలు మూతపడే అవకాశముంది.
35
విద్యార్థులకు వరుస సెలవులు
ఈ రెండు సెలవులతో పాటు, వచ్చే వారాంతంలో జూలై 26 (శనివారం) హాఫ్ డే లేదా పూర్తి సెలవు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవుగా ఉంటుంది. జూలై 27 ఆదివారం రెగ్యులర్ సెలవు. మొత్తంగా చూస్తే విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి.
జూలై 21 (సోమవారం), జూలై 23 (బుధవారం), జూలై 26 (శనివారం), జూలై 27 (ఆదివారం) స్కూళ్లకు సెలవులు ఉన్నాయి.
ఇలాంటి సెలవుల మధ్యలో జూలై 22 (మంగళవారం), జూలై 24 (గురువారం), జూలై 25 (శుక్రవారం) మాత్రమే పూర్తిగా తరగతులు నిర్వహించే రోజులుగా ఉన్నాయి. ఈ మూడు రోజులే వచ్చే వారం విద్యార్థులు తరగతులకు హాజరయ్యే అవకాశం కలుగుతుంది.
55
వరుస సెలవులు.. తల్లిదండ్రులు ముందస్తు ప్రణాళికలు చేసుకోండి మరి !
వరుస సెలవులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో పిల్లలు చదువుతో పాటు సెలవులను సద్వినియోగం చేసుకోవడంతో మంచి వీకెండ్ ను గడపవచ్చు. బోనాల సందడి, విద్యార్థి ఉద్యమం, వారాంతపు విశ్రాంతి... ఇవన్నీ కలిసి వచ్చే వారం విద్యార్థులకు సెలవుల పరంగా ప్రత్యేకంగా ఉండనుంది.