భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎప్పటికీ నష్టపోరని చెబుతుంటారు. అందుకే ఎక్కడో ఒక చోట కొంత మొత్తాన్ని కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరలో అందుబాటులో ఉండి, మంచి ఫ్యూచర్ ఉన్న ఓ ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు మధ్య తరగతి వర్గాలు సొంత ఇల్లు కలల్ని హైదరాబాద్ నగర కేంద్రంలో కాకుండా శివారులో నెరవేర్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అధిక ఖర్చులు, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో నగరానికి కాస్త దూరంగా తక్కువ ఖర్చుతో స్థలాలు, ఇళ్లు లభించే ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై హైవేపై ఉన్న రుద్రారం గ్రామం కీలకంగా మారింది.
25
అభివృద్ధి చెందుతున్న ప్రాంతం
రుద్రారం గ్రామం పటాన్‌చెరును దాటి, సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే ముందు కనిపిస్తుంది. నేషనల్ హైవేకి అనుకొని ఉండడం ఈ ప్రాంతానికి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే ఐఐటీ హైదరాబాద్, జాతీయ పరిశోధన సంస్థలు, విద్యాసంస్థలు చుట్టూ ఉండడం కూడా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారణంగా నివాస అవసరాలు, పెట్టుబడి అవకాశాలు పెరిగాయి. ప్రాజెక్టుల డెవలప్‌మెంట్ రేటు గణనీయంగా పెరిగింది.
35
ధరలు ఎలా ఉన్నాయంటే
రుద్రారం పరిసరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తృతంగా విస్తరిస్తోంది. ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఉన్నాయి. ఇది లొకేషన్, రోడ్డు వెడల్పు, లేఅవుట్‌కు HMDA లేదా DTCP అప్రూవల్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే హైవేకి అనుకొని ఉన్న ధరలు మాత్రం కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ప్రాంతంలో రూ. 20 లక్షల పెట్టుబడితో సుమారు 120 గజాల ప్లాట్‌ను సొంత చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
రుద్రారం ప్రాంత అభివృద్ధిలో కీలకంగా మారబోయే అంశం రీజినల్ రింగ్ రోడ్ (RRR). ఇది సంగారెడ్డి, నర్సాపూర్ వంటి ప్రధాన ప్రాంతాలను కలుపుతూ రుద్రారం ద్వారా వెళ్లనుంది. రహదారి అనుసంధానం మెరుగవడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు మెరుగుపడి, భవిష్యత్‌లో స్థలాల విలువలు భారీగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే గత ఏడాదిలో ధరలు సగటున 10% నుంచి 30% వరకు పెరిగాయని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి.
55
రుద్రారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా.?
సాధారణంగా, ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని ఇళ్లు తీసుకోవడం వల్ల మిగతా ప్రాంతాల కంటే తక్కువ ముడిపడుతుంది. కానీ రుద్రారం ప్రత్యేకత మాత్రం అదే కాదు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు దగ్గరగా ఉండడం, రింగ్ రోడ్ అనుసంధానం వంటి అంశాలు దీన్ని పెట్టుబడికి అనుకూలంగా మార్చుతున్నాయి. భవిష్యత్తులో నివాస అవసరానికి ఉపయోగించుకోవడానికి లేదా విక్రయించడానికి ఇక్కడ పెట్టుబడి పెట్టడం సురక్షితమైన ఎంపికగా చెప్పొచ్చు.