Ration Card: రేషన్ కార్డు కట్ కావొద్దంటే ఇలా చేయండి.. అంతా ఇంటి నుంచే !

Published : Sep 15, 2026, 11:18 AM IST

Ration Card : తెలంగాణ రేషన్ కార్డుదారులు కేంద్ర ప్రభుత్వ అధికారిక యాప్ ద్వారా లేదా సమీప రేషన్ షాపులో చాలా సులభంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే, మీ రేషన్ కార్డు కట్ కాకుండా మీరు ఇంటి నుంచే ఎలా ఈకేవైసీ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
రేషన్ కార్డు ఈ-కేవైసీ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు

తెలంగాణలో రేషన్ కార్డు పొందుతున్న లబ్ధిదారులు తమ కార్డులో పేర్లు కట్ కాకుండా ఉండటానికి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. దీనికోసం గంటల తరబడి రేషన్ షాపుల ముందో లేదా పౌరసరఫరాల శాఖ ఆఫీసుల చుట్టూనో తిరగాల్సిన అవసరం లేదని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి (DCSO) వనజాత స్పష్టం చేశారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే చాలా ఈజీగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సాంకేతికత ద్వారా ఈ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి.

25
స్మార్ట్‌ఫోన్‌లో ఈకేవైసీ సులభంగా పూర్తి చేయవచ్చు

మీ మొబైల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ చేయడానికి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'National Informatics Centre (NIC)' తీసుకొచ్చిన 'Mera eKYC' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనితో పాటు ఫేస్ స్కాన్ సరిగ్గా పనిచేయడానికి UIDAIకి చెందిన 'Aadhaar FaceRD' యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది. యాప్ ఓపెన్ చేశాక రాష్ట్రంగా తెలంగాణ ఎంచుకుని, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి.

35
ఫేస్ ఆథెంటికేషన్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ముఖాన్ని స్కాన్ చేసే ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఫోన్ కెమెరా ముందు మీ ముఖాన్ని ఉంచేటప్పుడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అలాగే ముఖానికి మాస్క్ లేదా సన్‌గ్లాసెస్ ధరించకూడదు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచి, ఫోన్ కదల్చకుండా ఫ్రేమ్‌లో ముఖం సరిగ్గా ఉండేలా చూసుకుంటే ఫేస్ స్కాన్ త్వరగా పూర్తవుతుంది. వెరిఫికేషన్ సక్సెస్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

45
కార్డులోని కుటుంబ సభ్యులందరికీ ఈకేవైసీ తప్పనిసరి

రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఒకరు ఈ-కేవైసీ చేస్తే సరిపోతుందని అనుకుంటే పొరపాటే. కార్డులో ఉన్న ప్రతి అర్హతగల సభ్యుడి వివరాలు ఆధార్‌తో సరిపోలాల్సి ఉంటుంది. లేకపోతే సదరు సభ్యుడి పేరు తొలగించే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మొబైల్ యాప్‌లో సమస్యలు ఎదురైనా లేదా ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ కాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేరుగా మీ పరిధిలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి e-PoS మిషన్ ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కాన్ ఇచ్చి ఆఫ్‌లైన్‌లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

55
ఆన్‌లైన్ ఈకేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

మీ ఈకేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి తెలంగాణ అధికారిక AePDS (smartpds.telangana.gov.in) పోర్టల్‌ను సందర్శించవచ్చు. వెబ్‌సైట్‌లోని Beneficiary Details విభాగానికి వెళ్లి రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేస్తే కుటుంబంలో ఎంతమందికి ఈ-కేవైసీ పూర్తయిందో స్పష్టంగా తెలుస్తుంది. పేర్ల పక్కన Active లేదా Verified అని ఉంటే కేవైసీ పూర్తయినట్లే. ఏవైనా సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం ఉంటే సమీపంలోని రేషన్ డీలర్‌ను సంప్రదించి సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చు. ఈకేవైసీ సేవలు పూర్తిగా ఉచితం కాబట్టి ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories