Published : Aug 02, 2025, 12:01 PM ISTUpdated : Aug 02, 2025, 12:08 PM IST
August Holidays : ఆగస్ట్ లో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి. వచ్చేవారం కేవలం నాల్రోజులే స్కూళ్లు నడిచేది, మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఏరోజు ఎందుకు సెలవుందో ఇక్కడ తెలుసుకుందాం.
Holidays : అకడమిక్ ఇయర్ ప్రారంభమై నెల నెలన్నర రోజులు పూర్తయ్యింది... కానీ ఇప్పటికీ కొందరు విద్యార్థులు వేసవి సెలవులను మరిచిపోలేకపోతున్నారు. ఈ చదువులు, పుస్తకాలకు దూరంగా సొంతూళ్లలో హాయిగా గడిపిన క్షణాలను కొందరు, అమ్మానాన్నలతో సరదాగా హాలిడే ట్రిప్ కు వెళ్లిన జ్ఞాపకాలను ఇంకొందరు, స్నేహితులతో రోజుల తరబడి ఆడుకున్న సమయాన్ని మరికొందరు విద్యార్థులు గుర్తుచేసుకుంటున్నారు. దీంతో సెలవులు మళ్లీ ఎప్పుడు వస్తాయా అని వాళ్లు ఎదురుచూస్తున్నారు.
అయితే వేసవి సెలవులు ముగిసాక విద్యార్థులకు పెద్దగా సెలవులు వచ్చిందిలేదు. జూన్, జులై రెండునెలల్లో కేవలం ఆదివారాలు, ఒకట్రెండు ఇతర సెలవులు మాత్రమే వచ్చాయి. కానీ ఆగస్ట్ లో ఇలాకాదు... వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో సెలవుల జాబితా చూస్తే విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ప్రారంభమయ్యే సెలవులు లాస్ట్ వీక్ వరకు కొనసాగనున్నాయి... ఇలా వచ్చేవారం సెలవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
DID YOU KNOW ?
2025లో సెలవులెన్ని?
2025లో తెలంగాణ ప్రభుత్వం మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్చిక సెలవులు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం 23 సాధారణ సెలవులు, 21 ఐచ్చిక సెలవులు ప్రకటించింది.
26
తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8 సెలవు
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఆగస్ట్ 8న అంటే వచ్చే శుక్రవారం సెలవు ఉంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇరురాష్ట్రాలు ఆప్షనల్ హాలిడే ప్రకటించాయి. అంటే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునే మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది.
అయితే కొన్ని విద్యాసంస్థలకు కూడా వచ్చే శుక్రవారం సెలవులు ఉండే అవకాశాలున్నాయి... ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఇలా వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొందరు విద్యార్థులకు సెలవు వచ్చే అవకాశం ఉంది.
36
వరలక్ష్మి వ్రతం
తెలుగు నెలల్లో శ్రావణమాసంను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు హిందువులు.. అందుకే ఈ నెలంతా పూజలు చేస్తుంటారు. మరీముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు ఆడపడుచులు వరలక్ష్మీ దేవిని పూజిస్తారు... శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం మరింత ప్రత్యేకం. ఈ రోజు మహిళలు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అందుకే ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ప్రకటించాయి.
ఈ నెలలోనే అన్నాచెల్లి, అక్కాతమ్ముళ్ల (సోదరసోదరీమణుల) ప్రేమానురాగాల పండగా రాఖీ పౌర్ణమి వస్తోంది. ప్రతి శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు.. ఇలా ఈసారి ఆగస్ట్ 9న ఈ పండగ వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడే ప్రకటించాయి.
అయితే ఈ ఆప్షనల్ హాలిడేతో అవసరం లేకుండానే వచ్చే శనివారం సాధారణ సెలవు వస్తోంది. ప్రతినెలలో రెండో శనివారం ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది... ఇలా ఆగస్ట్ 9న రెండో శనివారం వస్తోంది... ఈరోజే రాఖీ పౌర్ణమి/శ్రావణ పౌర్ణమి. కాబట్టి ఈ పండక్కి ఉద్యోగులు, విద్యార్థులకు సాధారణ సెలవే వర్తిస్తుంది.
56
రాఖీ పండగ
పండగరోజు అక్కచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను చాటుతారు... సోదరులు కూడా తమ తోబుట్టువులకు బహుమతులు అందిస్తారు. ఇలా ప్రతి కుటుంబం ఎంతో ఆనందంగా జరుపుకునే రాఖీ పౌర్ణమికి సెలవు రావడంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
66
ఆగస్ట్ 10 ఆదివారం సెలవు
ఆగస్ట్ 10న ఆదివారం... సాధారణంగానే సెలవు ఉంటుంది. ఇలా ఆగస్ట్ 8,9,10 వరుస సెలవులు వస్తున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది. వరలక్ష్మి వ్రతంకు ఆప్షనల్ హాలిడే... కొందరు ఉద్యోగులు, విద్యార్థులకే సెలవు ఉండవచ్చు... కానీ శని, ఆదివారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలన్నింటికి సెలవే. చాలామంది ఉద్యోగులకు కూడా ఈ రెండ్రోజులు సెలవు వస్తుంది.