Published : Jul 25, 2025, 02:59 PM ISTUpdated : Jul 26, 2025, 01:02 PM IST
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఆగస్ట్ 8 నుండి 17 వరకు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ హాలిడేస్ లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం... ఏరోజు ఎందుకు సెలవు వస్తుందో తెలుసుకుందాం.
Holidays : సెలవులనే మాట వింటేచాలు స్కూల్ పిల్లలు ఎగిరిగంతేస్తారు. ప్రతివారం వచ్చే ఆదివారం సెలవుకే ఆనందిస్తారు... ఇక వారం మధ్యలో ఏ పండగో, ప్రత్యేకమైన రోజో ఉండి సెలవు వచ్చిందంటే వారి ఆనందం రెట్టింపవుతుంది. ఇక ఈ సెలవు వీకెండ్ తో కలిసివస్తే వారిని పట్టలేం. అలాంటిది వరుసగా ఐదారురోజులు సెలవులు వస్తే... వారి ఆనందానికి అవధులుండవు. ఇలా మరో పదిరోజుల్లో తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి.
జులై నెల ముగింపుకు చేరుకుంది... మరో ఐదారురోజులు గడిస్తే ఆగస్ట్ లో అడుగుపెడతాం. అయితే ఆగస్ట్ పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సెలవులు అధికంగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా వరుసగా పదిరోజుల్లో ఆరు రోజులు సెలవులే... ఏ రోజు ఎందుకు సెలవు వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
28
ఆగస్ట్ 8న వరలక్ష్మి వ్రతం సెలవు
ఆగస్ట్ లో మొదటి వారం నుండే సెలవులు ప్రారంభం అవుతాయి. ఆగస్ట్ 3న ఆదివారం... ఆరోజు సాధారణ సెలవు. తర్వాత ఓ నాలుగురోజులు మాత్రమే వర్కింగ్ డేస్. అంటే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు పూర్తిగా పనిచేస్తాయి. తర్వాత వరుస సెలవులు ప్రారంభం అవుతాయి.
ఆగస్ట్ 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతం... తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించే పర్వదినం. అందుకే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే వరలక్ష్మి వ్రతం రోజున వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. ఇక హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు... కొందరికి ఆరోజు సెలవు కూడా ఉంటుంది. ఇలా ఆగస్ట్ 8 వరలక్ష్మి వ్రతంతో ముగుస్తుంది.
38
ఆగస్ట్ 9న రెండో శనివారం, రాఖీ సెలవు
వరలక్ష్మి వ్రతం తర్వాతిరోజు రెండో శనివారం... కాబట్టి ఈరోజు కూడా సెలవే. ప్రతి నెలలో రెండో శనివారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
అయితే ఆగస్ట్ 9న మరో పండగకూడా ఉంది. రాఖీ పండక్కి తెలుగు ప్రభుత్వాలు ఐచ్చిక సెలవు ఇచ్చాయి. కానీ దీని అవసరం లేకుండానే విద్యార్థులకు సెలవు వస్తోంది.
ఇక ఆగస్ట్ 10న ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. ఇలా ఆగస్ట్ 8 నుండి 10 వరకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ రోజుల్లో వచ్చే పండగలను విద్యార్థులు ఎంజాయ్ చేస్తూ ఘనంగా జరుపుకోవచ్చు.
58
ఆగస్ట్ 11-14 స్కూళ్లునా క్లాసులుండవు
వరుసగా మూడ్రోజుల సెలవులు ముగిశాక కూడా విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు ప్రారంభం అవుతాయి కాబట్టి. ఆగస్ట్ 11 నుండి 14 వరకు విద్యార్థులకు జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు రిహార్సల్స్, ఆటల పోటీలు నిర్వహిస్తారు. అంటే ఈ నాల్రోజులు పెద్దగా క్లాసులు ఉండవు. ఓ రకంగా చెప్పాలంటే ఇవికూడా సెలవులు అన్నమాటే.
68
ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవ సెలవు
ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు… విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేస్తారు. మిఠాయిలు పంచిపెడతారు… తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవచ్చు.
78
ఆగస్ట్ 16 శ్రీకృష్ణాష్టమి సెలవు
హిందువుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి పుట్టినరోజును కృష్ణాష్టమి, గోకులాష్టమిగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు… పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ఉట్టికొట్టే వేడుకలు నిర్వహిస్తారు. కాాబట్టి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు ఉంటుంది.
88
ఆగస్ట్ 17 ఆదివారం సెలవు
ఆదివారం సాధారణ సెలవు ఉంటుంది. ఇలా ఆగస్ట్ 15 నుండి 17 వరకు వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. మొత్తంగా ఆగస్ట్ 8 నుండి 17 వరకు (పదిరోజుల్లో) ఆరురోజులు సెలవులే... మిగతా నాలుగురోజులు స్కూళ్లు నడిచినా క్లాసులు నడివే అవకాశాలు తక్కువ. కాబట్టి ఈ పదిరోజులు విద్యార్థులు తెగ ఎంజాయ్ చేయవచ్చు.