Rain Alert : తెలంగాణలో అప్పటివరకు వర్షాలు తగ్గేదేలే... ఈ జిల్లాల ప్రజలు బిఅలర్ట్

Published : Jul 25, 2025, 06:00 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జులై 29 వరకు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

PREV
16
మరో ఐద్రోజులు వర్షాలే వర్షాలు

Telangana and Andhra Pradesh Weather : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పతుడుతున్న అనుకూల పరిస్థితులతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిరోజులు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటిస్తోంది.

26
పొంగిపొర్లుతున్న నదులు, వాాగులు వంకలు

ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలాశయాలు, కుంటలు నిండిపోయాయి. అన్ని ప్రాజెక్టుల్లో గెట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

జులై 29 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, నీటి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ సిబ్బంది ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు.

36
నేడు తెలంగాణలో వర్షాలు

ఇవాళ (శుక్రవారం) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

46
హైదరాబాద్ పరిస్ధితి అంతే

ఇక హైదరాబాద్ లో గురువారమంతా ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఎక్కడిక్కడ రోడ్లపైకి నీరుచేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది... పలు లోతట్టు కాలనీల్లోకి నీరుచేరి ప్రజలు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం కూడా ఇదే పరిస్ధితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాల నేపథ్యంలో సాప్ట్ వేర్ కంపనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

56
నేడు ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు

శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోందట. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

66
విజయవాడకు వరద ప్రమాదం పొంచివుందా?

భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. గతేడాది మాదిరిగానే మళ్లీ బుడమేరు పొంగుతుంది.. వరదనీరు నగరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. 

అయితే అధికారులు మాత్రం విజయవాడకు ఎలాంటి ప్రమాదం లేదని... ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న కొత్తపేట సీఐ విజయవాడ ప్రజలకు సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories