School Holidays : ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా రెండ్రోజులు సెలవులే

Published : Nov 03, 2025, 10:14 PM IST

November Holidays : నవంబర్ ఫస్ట్ వీక్ లోనే విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి. మధ్యలో ఓ ఐచ్చిక సెలవు, వీకెండ్ లో రెండ్రోజుల సెలవులు ఉన్నాయి. ఏరోజు ఎందుకు సెలవుందో తెలుసా?

PREV
15
ఈ వీక్ లో వరుస సెలవులు

School Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం... ఈ వారం వరుసగా రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈ రెండ్రోజులు సెలవే. ఇటీవల దీపావళి, ఆ తర్వాత వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు వచ్చాయి... వీటిని ఇంకా మర్చిపోలేకపోతున్న విద్యార్థులకు తాజా సెలవులు ఊరటనివ్వనున్నాయి. కేవలం స్టూడెంట్స్ కే కాదు పేరెంట్స్ కూడా సెలవులున్నాయి... కాబట్టి హాయిగా చిన్న ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

25
ఏరోజు ఎందుకు సెలవులు?

నవంబర్ ఫస్ట్ వీక్ లోనే వరుసగా రెండురోజులు సెలవులు వస్తున్నాయి. నవంబర్ 8న రెండో శనివారం... కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక ఆ తర్వాతి రోజు ఎలాగూ ఆదివారమే కాబట్టి సెలవు. ఇలా కాలేజీ యువతీయువకులకు కూడా ఈ రెండ్రోజుల సెలవులు వర్తిస్తాయి.

35
ఉద్యోగులకు సెలవే

కేవలం విద్యార్థులకే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండో శనివారం సెలవు ఉంటుంది... ఆదివారం సాధారణ సెలవు. ఇక కొన్ని ప్రైవేట్ కార్పోరేట్, మల్టి నేషనల్ సంస్థల్లో పనిచేసేవారితో పాటు ఐటీ కంపెనీల ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. కాబట్టి హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఎక్కువమంది ఉద్యోగులకు ఈ వీకెండ్ సెలవు ఉంటుంది.

45
హైదరాబాద్ లో నవంబర్ 11 సెలవు

తెలంగాణలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ ప్రక్రియ కూడా ముగింసింది... అన్నిపార్టీలు ముమ్మర ప్రచారాన్ని సాగిస్తున్నాయి. నవంబర్ 11న ఈ నియోజకవర్గ పరిధిలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అందుకే ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించింది ప్రభుత్వం... అంతేకాదు నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అధికారికంగా సెలవు ఇచ్చింది... ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా కుదిరితే సెలవు లేదంటే ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించాలని సూచించారు.

55
నవంబర్ 5న కూడా సెలవేనా?

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని తెలుగు రాష్ట్రాల్లో పండగలా జరుపుకుంటారు... అందుకే నవంబర్ 5న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఉద్యోగులకు ఐచ్చిక సెలవులు ప్రకటించాయి. అంటే ఆరోజు అవసరం అనుకుంటే ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మహిళా ఉద్యోగులు ఎక్కువగా సెలవు తీసుకునే అవకాశాలుంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories