హైదరాాబాద్ శివారులోని ఈ ఫేమస్ హోటల్లో ఇదీ పరిస్థితి..
ఇలా హైదరాబాద్ శివారులో ముంబై హైవే NH 65 పై గల ప్యాలస్ హోటల్ పై అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సంగారెడ్డి సమీపంలో రుద్రారం దగ్గర్లోని ఈ హోటల్లో నిత్యం వందలాది మంది ఆగుతుంటారు... ఎంతో ఇష్టంగా అక్కడ ఆహారం తింటుంటారు. కానీ ఈ హోటల్ నిర్వహకులు కస్టమర్ల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని... కిచెన్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు.
బొద్దింకలు, ఎలుకలతో కూడిన కిచెన్ లో ఎలాంటి మూతలు, లేబుల్స్ లేకుండానే అహార పదార్థాలు ఉన్నాయి... పాడయిపోయిన అహార పదార్థాలను కూడిన ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. అలాగే కిచెన్ మురుగునీటి వ్యవస్థ మూసుకుపోయి పరిస్థితి దారుణంగా ఉందని... ఆ దుర్గందభరిత, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు వండి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు గుర్తించారు.
ఇక శాఖాహారం, మాంసాహార పదార్ధాలన్నింటికి ఒకేదగ్గర వండుతున్నట్లు గుర్తించారు. అహారం రుచిగా, కలర్ ఫుల్ గా ఉండేందుకు సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ప్యాలస్ హోటల్ పై కేసు నమోదు చేశారు... అహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం హోటల్ లైసెన్స్ రద్దు చేశారు. అంతేకాదు 107 కిలోలకు పైగా పాడయిపోయిన రొయ్యలు, ఫిష్, చికెన్, గోబి ప్రై వంటికి అక్కడికక్కడే పడేశారు.