Saudi Arabia Road Accident : సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 16 మంది మరణించారు. ఓ వ్యక్తి ప్రాణాలతో బైటపడ్డారు. మృతుల వివరాలిలా ఉన్నాయి.
Saudi Bus Accident : విదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదం హైదరాబాద్ లో విషాదాన్ని నింపింది. నగరంనుండి సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాల సందర్శనకు వెళ్లారు కొందరు యాత్రికులు. వీరంతా మక్కాను సందర్శించి మదీనాకు ఓ బస్సులో వెళుతుండగా ఘోరం జరిగింది. వేగంగా దూసుకెళుతున్న బస్సు ఓ డీజిల్ ట్యాంకర్ కు ఢీకొట్టింది... దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సులోని 42 మంది సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.
25
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన హైదరబాదీల లిస్ట్ ఇదే
సౌదీ అరేబియాలో గత రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మొత్తం 42 చనిపోయారు... వీరిలో 16 మంది హైదరబాదీలు ఉన్నట్లు సమాచారం. వీళ్లంతా నగరంలోని మల్లేపల్లి బజార్ ఘాట్, అసిఫ్‌నగర్, జిర్రా, హబీబ్‌నగర్‌కు చెందినవారుగా తెలుస్తోంది.
1. రహీమున్నీసా
2. రహమత్ బీ
3. షెహనాజ్ బేగం
4. గౌసియా బేగం
5. కదీర్ మహ్మద్
6. మహ్మద్ మౌలానా
7. షోయబ్ మహ్మద్
8. సోహైల్ మహ్మద్
9. మస్తాన్ మహ్మద్
10. పర్వీన్ బేగం
11. జకియా బేగం
12. షౌకత్ బేగం
13. ఫర్హీన్ బేగం
14. జహీన్ బేగం,
15. మహ్మద్ మంజూర్
16. మహ్మద్ అలీ
35
మృతులంతా రెండు కుటంబాలకు చెందినవారే..
ప్రమాదంలో చనిపోయిన హైదరబాదీలంతా కేవలం రెండు కుటుంబాలకు చెందినవారిగా తెలుస్తోంది. ఓ కుటుంబంలో 8మంది, మరో కుటుంబానికి చెందిన ఇంకో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంనుండి బస్సు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా బయటపడిన యువకుడు షోయబ్ గా గుర్తించారు.. అతడు కూడా హైదరాబాద్ కు చెందినవాడిగానే తెలుస్తోంది.
ఆల్ మక్కా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది సౌదీ అరేబియా యాత్రకు బయలుదేరినట్లు సమాచారం. వీరంతా (42మంది) ఒకే బస్సులో మక్కా నుండి మదీనాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది... డ్రైవర్ తో పాటు మరోవ్యక్తి ప్రాణాలతో బైటపడగా 42 మంది సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.
సౌదీ అరేబియా ప్రమాదంపై సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
తెలంగాణ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు
79979 59754
99129 19545
న్యూడిల్లీలోని తెలంగాణ భవన్ కంట్రోల్ రూం నెంబర్లు
వందన (రెసిడెంట్ కమీషనర్ పీఎస్) : ఫోన్ నెంబర్ 98719 99044
సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) : ఫోన్ నెంబర్ 99583 22143
రక్షిత నైల్ (Liaison Officer): ఫోన్ నెంబర్ 96437 23157
సౌదీ అరేబియాలో ఇండియన్ ఎంబసి హెల్ప్ లైన్ నెంబర్
టోల్ ఫ్రీ నెంబర్ 8002440003
55
తెలంగాణ ప్రభుత్వ సహాయక చర్యలు...
సౌదీ రోడ్డు ప్రమాదంలో హైదరబాదీలు మరణించినట్లు తెలియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే ప్రమాదంలో మరణించిన హైదరబాదీలు వివరాలు సేకరించాలని సీఎస్, డిజిపిని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.
ఇక ఈ ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దిగ్బాంతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలోని ఎన్నారై కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అక్కడి నేతలకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు.