RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం

Published : Aug 28, 2026, 03:36 PM IST

RTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌స్టాప్ బస్సుల్లో టికెట్ తీసుకునే విధానాన్ని సులభతరం చేసేందుకు సెల్ఫ్ టికెటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

PREV
15
నాన్‌స్టాప్ బస్సుల్లో కొత్త టికెట్ విధానం

ప్రస్తుతం నాన్‌స్టాప్ బస్సుల్లో ప్రయాణించే సమయంలో టికెట్ తీసుకునేందుకు సిబ్బందిపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీన్ని మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. సెల్ఫ్ టికెటింగ్ ద్వారా ప్రయాణికులే తమ టికెట్‌ను స్వయంగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు చేసే వారికి ఈ విధానం మరింత ఉపయోగకరంగా ఉండనుంది.

25
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే టికెట్ చేతిలోకి

కొత్త విధానంలో బస్సు ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌తో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అనంతరం టికెట్ బుకింగ్‌కు సంబంధించిన వివరాలు మొబైల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుడు ఏ ప్రాంతం నుంచి బస్సులోకి ఎక్కుతున్నాడు, ఎక్కడ దిగాలి వంటి వివరాలను నమోదు చేసిన తర్వాత ఆన్‌లైన్‌లోనే చెల్లింపు చేయాలి. చెల్లింపు పూర్తయిన వెంటనే డిజిటల్ టికెట్ జనరేట్ అవుతుంది. బస్సులోకి ఎక్కిన తర్వాత ఆ టికెట్‌ను డ్రైవర్‌కు చూపించి ప్రయాణం కొనసాగించవచ్చు.

35
తొలుత ఈ రూట్‌లో ప్రయోగాత్మకంగా అమలు

సెల్ఫ్ టికెటింగ్ విధానాన్ని మొదటగా నల్గొండ–హైదరాబాద్ నాన్‌స్టాప్ మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మార్గంలో దాదాపు 45 డీలక్స్ నాన్‌స్టాప్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ మార్గంలో కొత్త టికెటింగ్ విధానం ఎలా పనిచేస్తుందో అధికారులు పరిశీలించనున్నారు. ప్రయాణికుల స్పందన, సాంకేతిక సమస్యలు, టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

45
సెప్టెంబర్ చివరి నాటికి మరిన్ని రూట్లకు విస్తరణ

ప్రయోగాత్మకంగా చేపట్టిన విధానం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర నాన్‌స్టాప్ సర్వీసులకు కూడా సెల్ఫ్ టికెటింగ్‌ను విస్తరించే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి మరిన్ని మార్గాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొత్త విధానం వల్ల టికెట్ జారీకి పట్టే సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు బస్సు ఎక్కే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. నాన్‌స్టాప్ సర్వీసుల్లో టికెట్ జారీకి సంబంధించిన పనిభారం తగ్గడం ద్వారా సిబ్బందికి కూడా కొంత వెసులుబాటు లభించనుంది.

55
స్మార్ట్‌ఫోన్ లేనివారికి పాత విధానమే

అయితే సెల్ఫ్ టికెటింగ్ విధానం అందుబాటులోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా డిజిటల్‌గానే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ లేని వారు, ఆన్‌లైన్ చెల్లింపులు చేయలేని వారు సాధారణ పద్ధతిలో టికెట్ తీసుకుని ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ మై టికెట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. మొదటి దశలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి, ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇతర నాన్‌స్టాప్ మార్గాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు. మొత్తంగా చూస్తే.. నాన్‌స్టాప్ బస్సుల్లో టికెట్ తీసుకునే ప్రక్రియను డిజిటల్‌గా మార్చడం ద్వారా ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించడమే టీజీఎస్‌ఆర్టీసీ లక్ష్యంగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories