Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్

Published : Aug 15, 2026, 08:12 AM IST

స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. తెలంగాణ, ఏపీలో ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

PREV
14
వాయుగుండం ఎఫెక్ట్... భారీ నుండి అతిభారీ వర్షాలు

Heavy Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో నేడు (ఆగస్ట్ 15, శనివారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకు బలపడుతూ వాయుగుండంగా మారిందని ప్రకటించింది. ఇది ఇప్పటికే తీరం దాటి దేశవ్యాప్తంగా భారీ వర్షాలను కురిపిస్తోంది... ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగాలు ప్రకటించాయి.

24
నేడు తెలంగాణలో భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా మారాయి... ఇలా వాతావరణం అనుకూలంగా మారడంతో గత కొన్నిరోజులుగా నిర్మలంగా ఉన్న ఆకాశం నేడు నల్లని మబ్బులతో నిండిపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్ట్ 15న పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తోంది... ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఉంటాయంటోంది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

34
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ పై వాయుగుండం ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిస అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది.

44
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ ఒడిశా, చత్తీస్ ఘడ్ తో పాటు గంగానది పరివాహక రాష్ట్రాల్లో గట్టిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో కూడా వర్షతీవ్రత పెరుగుతుందని IMD హెచ్చరించింది.

ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలుంటాయని... గుజరాత్, గోవా, రాజస్థాన్ లో ఇదే పరిస్థితి ఉంటుందట. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందట. మొత్తంగా దేశవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories