ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే

Published : Feb 11, 2026, 12:07 PM IST

Real estate: హైద‌రాబాద్‌లో భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌కు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న ప‌ట్ట‌ణాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి. హైద‌రాబాద్‌లో క‌లిసిపోనున్న ఓ ప‌ట్ట‌ణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ తూప్రాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్న తూప్రాన్ భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ హబ్‌గా ఎదగొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మేడ్చ‌ల్‌కు అత్యంత స‌మీపంలో ఉన్న ఈ ప‌ట్ట‌ణం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోనుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తక్కువ ధరల్లో భూములు లభించడం, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం, రవాణా సదుపాయాలు పెరగడం వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడే ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మంచి రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

25
అదే బలమైన ప్లస్ పాయింట్

తూప్రాన్ మేడ్చల్ నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుచిత్ర నుంచి సుమారు 42 కిలోమీటర్లు, సికింద్రాబాద్ నుంచి దాదాపు 50 నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దూరం పెద్దగా కాకపోవడంతో హైదరాబాద్ నగరానికి తూప్రాన్ మంచి కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా మారుతోంది. నగర హడావుడి నుంచి కొంత దూరంగా, కానీ పూర్తిగా దూరం కాకుండా ఉండే స్థలం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా మారుతోంది. ఇక ట్రిపులార్ రోడ్డు కూడా తూప్రాన్ డెవలప్ మెంట్ కి ఒక కారణంగా చెప్పొచ్చు. 

35
ఉద్యోగుల అప్ అండ్ డౌన్‌కు అనుకూలమైన ప్రాంతం

హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగులు తూప్రాన్ నుంచి నగరానికి అప్ అండ్ డౌన్ చేయగల అవకాశాలు ఉన్నాయి. రోడ్డు సదుపాయాలు మెరుగ్గా ఉండటం వల్ల రోజువారీ ప్రయాణం సాధ్యమవుతోంది. నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు, అద్దెలను దృష్టిలో పెట్టుకుంటే కొంత దూరంలో స్వంత ఇల్లు కొనుగోలు చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తూప్రాన్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య పెరిగితే హౌసింగ్ డిమాండ్ కూడా పెరగవచ్చు. ఇక గ‌తంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కొంప‌ల్లిలే గేట్ వే ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. భ‌విష్య‌త్తులో ఈ ప్రాజెక్ట్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కే అవ‌కాశాలు ఉన్నాయి.

45
మెట్రో, ఎలివేటెడ్ కారిడార్ – గేమ్ చేంజర్ అవుతాయా?

త్వరలోనే జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎలివేటెడ్ కారిడార్ కూడా ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టులు పూర్తైతే మేడ్చల్ వరకు ప్రయాణం వేగవంతమవుతుంది. దీంతో తూప్రాన్ నుంచి హైటెక్ సిటీకి సుమారు గంటన్నర నుంచి రెండు గంట‌ల్లోనే చేరే అవకాశం ఉంటుంది. ఐటీ రంగంలో పనిచేసే వారికి ఇది పెద్ద సౌలభ్యం. రవాణా సదుపాయాలు మెరుగుపడితే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విలువలు పెరగడం సాధారణం. అందుకే ఈ ప్రాజెక్టులను తూప్రాన్ అభివృద్ధికి కీలకంగా చూస్తున్నారు.

55
ఎన్‌హెచ్ 44, పారిశ్రామిక అభివృద్ధి

తూప్రాన్‌కు మరో ప్రధాన బలం ఎన్‌హెచ్ 44. ఈ జాతీయ రహదారి విశాలంగా ఉండటం వల్ల హైదరాబాద్‌కు వేగంగా చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ ఉండటం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కీలకం. మేడ్చల్ నుంచి తూప్రాన్ వరకు పారిశ్రామిక అభివృద్ధి కూడా కొనసాగుతోంది. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. ఉద్యోగాలు పెరిగితే నివాస అవసరం పెరుగుతుంది. ఇదే రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ముందుకు నడిపే ప్రధాన శక్తి. ఈ అన్ని అంశాలను పరిశీలిస్తే రాబోయే సంవత్సరాల్లో తూప్రాన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే పరిశీలించి పెట్టుబడి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉండొచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు నిపుణుల సూచ‌న‌లు పాటించ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories