హైదరాబాద్‌లో భూములకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ హవా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా రానున్న రోజుల్లో మళ్లీ రియల్ బూమ్ పెరగడం ఖాయమని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ పరిసరాల్లో వసతిచ పరిశ్రమల స్థాపనకు అనువైన భూములకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న ప్రాంతాలు అభివృద్ధి దశలో ఉండటంతో, ఇక్కడ భూములకు ఆసక్తి పెరిగింది.
దీనివల్ల భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
25
మార్కెట్ విలువ రెట్టింపు దిశగా అడుగులు
ఈ పెరుగుతున్న డిమాండ్‌ను ఆదాయ వనరుగా మార్చుకోవాలని భావిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు శాఖలు కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
కొంతమేర భూమి ధరలు ఇప్పటికే పెరిగిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ మార్కెట్ విలువను రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌లుగా మారిన మండలాలపై దృష్టి పెట్టారు.
35
‘ఫ్యూచర్ సిటీ’ నుంచి ‘ఫార్మా హబ్’ వరకు
సర్కార్ ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ, ఫార్మా హబ్‌లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, యువ భారత్ స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలు వంటి ప్రాజెక్టుల ప్రకటనలతో ఈ ప్రాంతాల్లో భూముల విలువ క్రమంగా పెరుగుతోంది.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే, వేలాది ఉద్యోగావకాశాలు, వాణిజ్య అవకాశాలు రావడం వల్ల భూములపై ఆదాయం దృష్టిలో పెట్టుకొని పెట్టుబడిదారులు, డెవలపర్లు ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం ORR, RRR మధ్య భూముల ధరలు ప్రభుత్వంగా నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం చాలా తక్కువగా ఉన్నాయి. ఫలితంగా భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్ రేట్లను పెంచాలనే నిర్ణయానికి వస్తోంది. ఇది ఒక్క ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే కాకుండా, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పారదర్శకతను కూడా పెంచుతుంది.
55
త్వరలోనే అధికారిక ప్రకటన
ప్రస్తుతం రెవెన్యూ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలు త్వరలో సీఎం కార్యాలయానికి పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేట్ల వివరాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత, స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి వస్తాయి.
కొన్ని కీలక మండలాల్లో మార్కెట్ విలువ “అసాధారణ స్థాయిలో” పెరగనుందని సమాచారం. ఈ మార్పులతో పాటు, భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మరింత ఊపొచ్చే అవకాశముంది.