KTR: ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..

Published : Jun 16, 2025, 10:21 AM ISTUpdated : Jun 16, 2025, 10:40 AM IST

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా వ‌న్ కేసులో భాగంగా ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సోమ‌వారం ఉద‌యం కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. 

PREV
14
కాంగ్రెస్ మోసాల‌ను ఎండ‌గ‌డుతూనే ఉంటాం.

కమిషన్లు, విచారణలు, రాజకీయ వేధింపులు ఎన్ని వ‌చ్చినా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండ‌గ‌డుతూనే ఉంటాం. ఆరు గ్యారంటీల పేరుతో మోసం జరిగిందని ఆరోపించిన కేటీఆర్, ప్రజల కోసం పోరాటాన్ని విరమించేది లేదన్నారు.

24
వెన‌క్కి త‌గ్గ‌ను.

“మీ విచారణలు, ప్రతీకార రాజకీయాలకు నేను వెనక్కి తగ్గను. 420 వాగ్దానాలు, మోసపూరిత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల అమలు లోపాలను బహిర్గతం చేస్తూనే ఉంటాం” అని స్పష్టం చేశారు. ప్రజల ఆశలతో కాంగ్రెస్ చెల‌గాట‌మాడింద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

34
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కానున్న కేటీఆర్

ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి జరిగే అవినీతి దర్యాప్తులో భాగంగా కేటీఆర్‌ను ఏసీబీ విచారణకు పిలిచింది. ఈ విచారణకు హాజరు కావడానికి ముందుగా ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

ఏసీబీ విచారణకు ముందుగా కేటీఆర్ తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విచారణకు సంబంధించిన అంశాలు, రాజకీయ వ్యూహాలు చర్చించినట్లు సమాచారం.

44
తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం

విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌కి వెళ్లనున్నారు. అక్కడ బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో సమావేశం జరుగనుంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేశ్‌, పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, పటోళ్ల కార్తిక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ 

Read more Photos on
click me!

Recommended Stories