KTR ను అరెస్ట్ చేస్తారా..? ఇందుకు అంతా సిద్దం చేసారా?

Published : Jun 16, 2025, 11:42 AM ISTUpdated : Jun 16, 2025, 11:49 AM IST

తెలంగాాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంటుందా? ఏసిబి విచారణకు హాజరైన కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ ప్లానా? 

PREV
15
ఏసిబి విచారణకు ముందు కేటీఆర్ సంచలనం

KTR : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఫార్ములా ఈ రేసు కేసులో ఆయనను అరెస్ట్ తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్వయంగా కేటీఆరే దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(సోమవారం) ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అంచనా వేసారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.

25
కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా?

తనను అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... ఈ విషయం తనకు ఎప్పుడో తెలుసని కేటీఆర్ అన్నారు. జైలుకు వెళ్లడం తనకేమీ కొత్తకాదు... తెలంగాణ కోసం ఇప్పటికే అనేకసార్లు జైలుకు వెళ్లానని పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలని అనుకుంటున్నారని... అందుకే ఏ తప్పూ జరగకున్నా ఫార్ములా ఈ రేస్ ను కావాలనే తెరపైకి తెచ్చారన్నారు. ఈ కేసు పెట్టినప్పుడే తనను అరెస్ట్ చేస్తారని తెలిసిపోయిందన్నారు కేటీఆర్.

తనకు చట్టం అంటే గౌరవం ఉంది... అందుకే తప్పు చేయకున్నా ఏసిబి విచారణకు హాజరవుతున్నానని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు పిలిచారు... ఇది మూడోసారి అని అన్నారు. ఇంకా 30 సార్లు పిలిచిన విచారణకు వెళ్తానని కేటీఆర్ అన్నారు. ఏ తప్పూ చేయలేను కాబట్టే భయంలేదు... విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ తెలిపారు.

35
ఈ కమీషన్లు, కేసులకు భయపడబోం...

కేవలం తమను ఇబ్బంది పెట్టడానికే ఈ కేసులు, కమీషన్లు వేస్తున్నారు... వీటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఇబ్బంది పెట్టినంతమాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం ఆపబోమన్నారు. భయపెడితే ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం మాత్రమేనని కేటీఆర్ అన్నారు. 

తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను సాకారంచేసిన కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావును కాళేశ్వరం కమీషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని అన్నారు. తనను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారని… అరెస్టు కూడా చేస్తారు కావచ్చు అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేవని ప్రజలకు తెలియాలి... అందుకే ఏసిబి విచారణను నాలుగు గోడల మధ్య సాగించరాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు దీనిపై చర్చిద్దాం... మీరు రెడీనా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసుపై అసెంబ్లీలో చర్చను కోరానని... కానీ చర్చించే దమ్ము, ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయాడని అన్నారు.

45
రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చిందని.. అవి అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటామన్నారు కేటీఆర్. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదు... అందుకే ప్రజల్లో ఆపార్టీపై నమ్మకం పోయిందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైన ప్రభుత్వం మళ్లీ రైతు భరోసాను తెరపైకి తెచ్చిందన్నారు.

రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి తీరును గమనిస్తున్నారని... 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇప్పుడు వాటిని విస్మరించి స్థానిక సంస్థలకు వెళ్తోందని అన్నారు. దీన్ని బీసీ ప్రజలు గమనించాలని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చేసిన మోసాన్ని నిరుద్యోగ యువత గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ చేసిందేమీ లేదు... చెప్పుకోవడానికి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని అన్నారు. ఏదో ఒక కమిషన్, ఏదో ఒక ఎంక్వయిరీ పేరిట కాలయాపన చేస్తున్నారని అన్నారు.

55
దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు రేవంత్.. కేటీఆర్ సవాల్

కాంగ్రెస్ బిజెపి దొంగనాటకాలు దొంగ బాగోతం అంతా తెలంగాణ ప్రజలకు అంతా అర్థమయిందన్నారు. కాంగ్రెస్ దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయమని బిజెపి అంటుందన్నారు. తమపై ఒక్కటి కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. . దమ్ముంటే, మొగోడే అయితే లై డిటెక్టర్ టెస్టుకు రేవంత్ రెడ్డి సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

Read more Photos on
click me!

Recommended Stories