Rain Alert: తెలుగు ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్‌.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు వ‌ర్షాలే వ‌ర్షాలు

Published : May 11, 2025, 06:45 AM ISTUpdated : May 11, 2025, 06:46 AM IST

మండె ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా వాతావార‌ణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే మూడు రోజులు ఏపీతో పాటు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత‌కీ ఏయే ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కావాలు ఉన్నాయి లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
14
Rain Alert: తెలుగు ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్‌.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు వ‌ర్షాలే వ‌ర్షాలు

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతాయని అధికారులు తెలిపారు. వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వెల్లడించారు.
 

24

ఆదివారం తెలంగాణ‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉంటుందని అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత మేఘాలు ఏర్పడతాయని అధికారులు అంచ‌నా వేశారు. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్‌లో వర్షం మొదలవుతుందని తెలిపారు. నిజామాబాద్, తాండూరు, మెదక్, మేడ్చల్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌న్నారు. 
 

34

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికొస్తే ఉదయం ఎండ తీవ్రంగా ఉంటుందని సాయంత్రం 5 తర్వాత రాయలసీమలో వర్షం ప్రారంభమ‌వుతుంద‌న్నారు. తిరుపతి, కడప ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. వర్ష సమయాల్లో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు సూచించారు. 
 

44

నైరుతీ రుతుప‌వ‌నాలు: 

ఈ సంవత్సరం మే 27న నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు IMD ప్రకటించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ సాధారణ కంటే 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా. ప్రస్తుతం అండమాన్ సముద్రం, కేరళ సమీప ప్రాంతాల్లో భారీ మేఘాల సమాహారం కనిపిస్తోంది. ఇది రుతుపవనాలు ముందుగా వచ్చేందుకు తోడ్పడనుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories