Published : May 06, 2025, 02:43 PM ISTUpdated : May 06, 2025, 03:25 PM IST
దేశవ్యాప్తంగా మే 7న అంటే బుధవారం పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు నగరాలను మాక్ డ్రిల్ కోసం ఎంపికచేసారు. ఆ నగరాలేవి, ఈ మాక్ డ్రిల్ లో ఏం చేయనున్నారు? తెలుసుకుందాాం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి... ఏ క్షణమైన ఒకరిపై ఒకరు దాడులకు దిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలాన్ని చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ కు సిద్దమయ్యింది.
24
Mock Drill In Telugu States
ఇలా యుద్దం జరిగితే ఎలా వ్యవహరించాలి? సురక్షితంగా ఉండేందుకు ఏం చేయాలి? అనేదానిపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
34
Mock drills in India
ఏమిటీ మాక్ డ్రిల్?
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ కవాతు సమయంలో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగించడం జరుగుతుంది. శత్రువుల దాడి సమయంలో తమను తాము రక్షించుకోవడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వనున్నారన్నమాట. దాడి జరిగితే విద్యుత్తు కోతలు, ముఖ్యమైన కర్మాగారాలు, సంస్థలను మూసివేయడం... ప్రజలను ఖాళీ చేయించడం వంటివి ప్రాక్టీస్ చేయిస్తారు.
ముందుగా ఎంపికచేసిన ప్రాంతాల్లో ప్రజలకు మాక్ డ్రిల్ పై సమాచారం అందిస్తారు. అంటే వైమానిక దాడి జరిగే సమయంలో మాదిరిగా అలర్ట్ సైరన్ మోగిస్తారు. ఈ సమయంలో ప్రజలు ఎలా వ్యవహరించాలి? ఎలాగయితే సురక్షితంగా ఉంటారు? అనేది ప్రయోగాత్మకంగా చూపిస్తారు.
ఇక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో భద్రతా సిబ్బంది ఎలా వ్యవహరిస్తారు? వారికి సామాన్యులు ఎలా సహకరించాలి? అన్నది కూడా మాక్ డ్రిల్ లో చేసి చూపిస్తారు. బంకర్లు, కందకాల వంటివాటిలో తలదాచుకుని సురక్షితంగా ఎలా ఉండాలో మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పిస్తారన్నమాట.